సౌతాఫ్రికా గడ్డపై నేడే ఆఖరి సమరం.. టాస్ గెలిచిన సఫారీలు

సౌతాఫ్రికా గడ్డపై నేడే ఆఖరి సమరం.. కోహ్లీ సేన టీ20ఇంటర్నేషనల్ సిరీస్ కైవసం చేసుకుంటుందా ?

Last Updated : Feb 25, 2018, 01:25 AM IST
సౌతాఫ్రికా గడ్డపై నేడే ఆఖరి సమరం.. టాస్ గెలిచిన సఫారీలు

సౌతాఫ్రికా గడ్డపై టీ20 ఇంటర్నేషనల్స్ 3 మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ ఆడుతున్న నేటి చివరి మ్యాచ్‌లో సఫారీ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టేన్ జేపీ డుమిని మాట్లాడుతూ... తమకు గత మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం అనేది కలిసొచ్చింది. అందుకే ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాం అని స్పష్టంచేశాడు. 

నేటి రాత్రి 9:30 గంటలకు షురూ కానున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తిక్, మనీష్ పాండే, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్ధుల్ థాకూర్, జస్ప్రిత్ బుమ్రా మైదానంలో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే, సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌తోపాటు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ సైతం గెలిచిన తొలి భారత జట్టుగా విరాట్ కోహ్లీ సేన చరిత్ర సృష్టిస్తుంది. 

Trending News