Netizens trolls BCCI after Bengaluru Chinnaswamy Stadium roof leaks: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్ వరుణుడి కారణంగా సమం అయింది. ఆదివారం రాత్రి బెంగళూరు వేదికగా జరగాల్సిన ఐదవ టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. టాస్ అనంతరం ఆటగాళ్లు మైదానంలోకి రాగానే వర్షం కురిసింది. దాంతో ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ 3.3 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం కురిసింది. ఆపై ఎంతకీ వరణుడు కరుణించకపోవడంతో.. భారత్, దక్షిణాఫ్రికా ఐదవ టీ20 మ్యాచ్ రద్దయింది. దాంతో ఐదు టీ20ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ రద్దు కావడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరోవైపు తమ అభిమాన ఆటగాళ్ల ఆటను దగ్గరుండి చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన అభిమానులు నానా తంటాలు పడ్డారు. వేల రూపాయల డబ్బు ఖర్చు పెట్టుకుని మ్యాచ్ చూడటానికి వస్తే.. . స్టేడియంలో పలు చోట్ల వర్షపు నీరు పోటెత్తింది. పలు చోట్ల స్టేడియం రూఫ్ నుంచి నీరు కారడంతో సీట్లల్లో కూర్చోవడానికి ఫాన్స్ ఇబ్బందిపడ్డారు. వర్షం పడని చోటికి పరుగులు తీశారు. దాంతో స్టేడియంలో కాసేపు గందరగోళంగా మారింది.
What was even more disappointing was the state of affairs inside the stadium! The richest board in the world and these are the kind of conditions their fans need to put up with! When will @BCCI @kscaofficial1 improve fan experience befitting the stature of the sport?? pic.twitter.com/eacucPnwUp
— Srinivas Ramamohan (@srini_ramamohan) June 19, 2022
ఐదవ టీ20 మ్యాచ్ చూడడానికి వచ్చిన కొందరు ప్రేక్షకులు రూఫ్ నుంచి నీరు కారడాన్ని తమ సెల్‌ఫోన్లలలో చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. దాంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వైఖరిపై విమర్శల వర్షం కురుస్తోంది. 'ప్రపంచంలోనే బీసీసీఐ ధనిక బోర్డు.. స్టేడియాన్ని రిపేర్ చేసే దిక్కు లేదు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'మ్యాచ్ రద్దైన దాని కంటే.. స్టేడియంలోని పరిస్థితులే ఎక్కువగా నిరాశకు గురిచేశాయి' అని మరొకరు కామెంట్ చేశారు. 'బీసీసీఐ, కర్ణాటక బోర్డు ఎప్పుడు స్టేడియంను సరిదిద్దుతాయి', 'ప్రపంచంలోనే ధనిక బోర్డు చెప్పుకోవడానికే' అంటూ విమర్శల వర్షం కురుస్తోంది.
ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో రిచ్చెస్ట్ బోర్డ్ బీసీసీఐ. మ్యాచ్, ప్రసార హక్కుల ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని జేబులో వేసుకుంటుంది. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా తాజాగా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన విషయం తెలిసిందే. అలాంటి బీసీసీఐ స్టేడియాలను మాత్రం సరిచేయట్లేదు.
Also Rad: Realme C30 Launch: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతో తెలుసా..
Also Read: Ruturaj Gaikwad Trolls: రుతురాజ్.. నీకంత అహంకారం ఎందుకు! ధోనీ, కోహ్లీ కూడా ఇలా చేయలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook