IND Vs SA Dream11 Team Tips: వరల్డ్ కప్‌లో కాసేపట్లో బిగ్‌ఫైట్.. సఫారీతో టీమిండియా ఢీ.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India Vs South Africa Playing11 and Dream11 Team: దక్షిణాఫ్రికాతో నేడు టీమిండియా తలపడనుంది. టోర్నీలో వరుస విజయాలు సాధించి.. రెండు జట్లు సెమీస్ చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..    

Written by - Ashok Krindinti | Last Updated : Nov 5, 2023, 12:05 PM IST
IND Vs SA Dream11 Team Tips: వరల్డ్ కప్‌లో కాసేపట్లో బిగ్‌ఫైట్.. సఫారీతో టీమిండియా ఢీ.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India Vs South Africa Playing11 and Dream11 Team: వరల్డ్ కప్‌లో నేడు మరో బిగ్‌ఫైట్ జరగనుంది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్‌ కోసం టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్‌ చేరినా.. అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సొంతం చేసుకున్న సఫారీ టీమ్‌ను మట్టికరిపిస్తుందో లేదో చూడాలి. 2011 ప్రపంచకప్‌లో సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలోనే భారత్ ఓడిపోయింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు రెండు జట్ల మధ్య పోరు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్టు ఎలా ఉంటుంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..

పిచ్, వెదర్ రిపోర్ట్ ఇలా..
 
ఈడెన్ గార్డెన్స్‌ భారీ స్కోర్లకు పెట్టింది పేరు. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్లు పండగ చేసుకుంటారు. ఆట చివరలో స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. లైన్‌ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే పేసర్లకు వికెట్లు దక్కుతాయి. ఇక్కడ మొత్తం 37 వన్డేలు జరగ్గా.. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 21 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఛేజింగ్ చేసిన జట్లు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ పిచ్‌పై భారత్ vs శ్రీలంక 404/5 మ్యాచ్‌లో నమోదైంది. ఆదివారం కోల్‌కతాలో పొగమంచు వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత 23 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. వర్షం కురిసే అవకాశం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. 

స్ట్రీమింగ్ వివరాలు..

==> వేదిక: ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం (టాస్ టైమ్)
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్

తుది జట్లు ఇలా (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి

IND Vs SA డ్రీమ్11 ప్రిడిక్షన్ టిప్స్..

వికెట్ కీపర్లు: క్వింటన్ డి కాక్ (వైస్ కెప్టెన్)

బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్

ఆల్‌రౌండర్లు: మార్కో జాన్సన్, మార్క్‌క్రమ్, రవీంద్ర జడేజా

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కేశవ్ మహరాజ్

Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు  

 Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News