Jasprit Bumra - Sanjana Ganeshan: జస్ప్రీత్ బుమ్రాతో వెకేషన్.. సంజన గణేశన్‌ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా!!

జస్ప్రీత్ బుమ్రాతో ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన పోటోలను  స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా బీచ్‌లో సేదతీరుతున్న ఫొటో వైరల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 05:07 PM IST
  • జస్ప్రీత్ బుమ్రాతో సంజన వెకేషన్
  • సంజన గణేశన్‌ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా
  • దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రా-సంజన
Jasprit Bumra - Sanjana Ganeshan: జస్ప్రీత్ బుమ్రాతో వెకేషన్.. సంజన గణేశన్‌ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా!!

Jasprit Bumrah's wife Sanjana Ganesan's Vacation Pictures goes Viral: సంజనా గణేశన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మోడల్, స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. గతంలో పలు క్రీడలకు సంబంధించిన ఈవెంట్‌లకు హోస్ట్‌గా చేసినా.. 2019 వన్డే ప్రపంచకప్‌ ద్వారానే ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 2019 ప్రపంచకప్‌ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా నిలదొక్కుకున్నారు. టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మర్చి 15న పెళ్లిచేసుకున్న సంజనా (Sanjana Ganesan).. అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో వివాహం అయ్యేవరకు వివరాలు గోప్యంగా ఉంచారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న తర్వాతే బుమ్రా-సంజన ప్రేమ వ్యవహారం అందరికి తెలిసింది.

పెళ్లి అనంతరం సంజనా గణేశన్, జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ మ్యాచుల కారణంగా బిజీబిజీ అయ్యారు. ఇంగ్లండ్ టూర్, ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచకప్‌ 2021, న్యూజీలాండ్ సిరీస్‌తో బుమ్రా బిజీ అయ్యాడు. అయితే న్యూజీలాండ్ సిరీస్‌ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే మధ్యలో బుమ్రా-సంజనకు కాస్త సమయం దొరకడంతో వెకేషన్‌కు వెళ్లారు. అంతేకాదు ఇద్దరు కలిసి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో చక్కర్లు కొడుతున్నారు. ఒకవైపు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మరోవైపు తమకు నచ్చిన రెస్టారెంట్‌లకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఐరీన్ కంట్రీ లాడ్జ్ (Irene Country Lodge)కు వెళ్లారు. అందుకు సంబందించిన పోటోలను సంజనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకుముందు ఇద్దరు కలిసి దిగిన పోటోలను కూడా పోస్ట్ చేశారు. 

Also Read: Liger Movie Glimpse: లేడీస్ అండ్ జంటిల్మెన్.. ఇట్స్ టైం.. లైగర్‌ మూవీ అప్డేట్..!!

జస్ప్రీత్ బుమ్రాతో ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన పోటోలను సంజనా గణేశన్ (Sanjana Ganesan) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా బీచ్‌లో సేదతీరుతున్న ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం బుమ్రా దక్షిణాఫ్రికా పర్యటల్లో మొదటి టెస్ట్ ఆడుతుండగా.. అదే మ్యాచుకు సంజన ప్రజెంటర్‌గా ఉన్నారు. ఈ మ్యాచులో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 7.2 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నీలో ముంబై ఇండియన్స్ (MI) తరఫున అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. 23 జనవరి 2016లో భారత జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా టీమిండియాకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం భారత పేస్ విభాగంను తన భుజాలపై మోస్తున్నాడు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన సంజన గణేశన్ (Sanjana Ganesan) ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7తో కెరీర్‌ ఆరంభించారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సంజనకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా, 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు.

Also Read: Roja Shocking Comments in Nani: "నాని నువ్వు కిరాణాకొట్టే పెట్టుకో.. సినిమాలు వేస్ట్.." యంగ్ హీరోపై రోజా సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News