IND vs SA: జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలిచి.. ఆ భారత దిగ్గజంకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి: గవాస్కర్

టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందించిన కపిల్ దేవ్ కోసం అయినా భారత్ రెండో టెస్ట్ గెలవాలని కోరాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 11:07 AM IST
  • ప్లీజ్ జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలవండి
  • ఆ భారత దిగ్గజంకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి
  • కపిల్ దేవ్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి
IND vs SA: జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలిచి.. ఆ భారత దిగ్గజంకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి: గవాస్కర్

Sunil Gavaskar urges Indian Players to win Johannesburg Test for Kapil Dev: జొహన్నెస్‌బర్గ్ (Johannesburg Test) వేదికగా టీమిండియా (Team India)తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) విజయానికి చేరువ అయింది. భారత్‌ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 122 పరుగులు మాత్రమే చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట ఉండటం, ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్లు ఉండటంతో విజయ అవకాశాలు దక్షిణాఫ్రికా జట్టుకే అధికంగా ఉన్నాయి. బౌలర్లు ఏమైనా అద్భుతం చేస్తే తప్ప.. భారత్ విజయాన్ని అందుకోలేదు. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే అది అద్భుతమే అవుతుంది. 

సూపర్‌ స్పోర్ట్‌లో 3వ రోజు భోజన విరామ సమయంలో టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ (1983 ODI World Cup) ట్రోఫీని అందించిన కపిల్ దేవ్ (Kapil Dev) కోసం అయినా భారత్ రెండో టెస్ట్ గెలవాలని కోరాడు. 'దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఎప్పుడూ టెస్ట్ సిరీస్‌ గెలవలేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ భారత్‌ చాలా తక్కువ టెస్టు మ్యాచ్‌లు గెలిచింది. చివరిసారిగా 2018లో ఇక్కడకు వచ్చిన భారత్‌.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ టెస్టు సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు టెస్ట్ సిరీస్ గెలిస్తే టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది' అని సన్నీ అన్నారు. 

Also Read:  RRR Movie: 'ఆర్ఆర్ఆర్'కు మరో ఎదురుదెబ్బ.. సినిమా విడుదల ఆపాలంటూ హై కోర్టులో పిల్!!

'గురువారం భారత క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీ అందించిన కపిల్ దేవ్ పుట్టినరోజు (Kapil Dev BirthDay). కాబట్టి జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలిచి భారత జట్టు కపిల్‌కు అద్భుతమైన బహుమతి ఇస్తుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత టీమ్‌లో కపిల్ దేవ్‌ను ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరూ పోరాడి అతనికి అద్భుతమైన బహుమతి ఇస్తారని నమ్ముతున్నా' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 63 ఏళ్ల కపిల్ పుట్టినరోజు నేడు. సునీల్ గవాస్కర్ మరియు సచిన్ టెండూల్కర్ (Sachin) వంటి వారిని కాకుండా 2000లో విస్డెన్ కపిల్‌ను టీమిండియా గొప్ప క్రికెటర్‌గా పేర్కొంది. 

1959వ సంవత్సరంలో పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఇదే రోజున కపిల్ దేవ్‌ జన్మించారు. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 175 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన కపిల్.. 175 పరుగుల ఈ ఇన్నింగ్స్‌కు కేవలం 138 బంతులు మాత్రమే తీసుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరుకోవడంలో ఆయన పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. కపిల్ 131 టెస్టుల్లో 29.64 సగటుతో 434 వికెట్లతో సహా 5248 పరుగులు చేశారు. 225 వన్డేల్లో 3783 రన్స్, 253 వికెట్లు పడగొట్టారు. 

Also Read: Delhi Fire Breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News