టీ20 ఫైట్ : టీమిండియా సీనియర్స్ రెస్ట్

బుధవారం కటక్ లో తొలి టీ20 మ్యాచ్ లో  శ్రీలంక జట్టుతో మరోసారి భారత్  తలపడనుంది. 

Last Updated : Dec 19, 2017, 06:16 PM IST
టీ20 ఫైట్ : టీమిండియా సీనియర్స్ రెస్ట్

కటక్: బుధవారం కటక్ లో తొలి టీ20 మ్యాచ్ లో  శ్రీలంక జట్టుతో మరోసారి భారత్  తలపడనుంది. టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోయినా.. టీమిండియా సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20లో మరోసారి గెలవాలని అతృతతో ఉంది.

ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక జట్టు గెలిచింది. ఆతరువాత ఆ ఛాన్స్ ను టీమిండియా కొట్టేసింది. మొహాలిలో జరిగిన రెండో వన్డేలో, వైజాగ్లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా గెలిచింది. శ్రీలంక జట్టు ఒక దశలో ఒక వికెట్ తో 136 పరుగులు సాధించి 215 పరుగులకే పరాజయం పాలైంది. మహేంద్ర సింగ్ ధోనీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ శ్రీలంక పరుగులను కట్టడి చేసారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత్ కు విజయం అందించారు.

అయితే టీ-20 క్రికెట్ భిన్నంగా ఉంటుంది. భారతదేశ మైదానంలో ఆడిన టీ-20 మ్యాచుల్లో మంచి జ్ఞాపకాలు ఏవీలేవు. బారాబతి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ 7-4 రికార్డు సృష్టించింది. 2015లో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆటలో భారత జట్టు 92 పరుగులు చేసింది. దీని తరువాత ప్రేక్షకుల హింస కారణంగా మైదానం అపఖ్యాతి చెందింది.

మొట్టమొదటి మ్యాచ్ ను కోల్పోయిన తరువాత,  డబుల్ సెంచరీ సాధించి మొహాలి మ్యాచ్ ను 141 పరుగుల తేడాతో ఓడించి, టీ20 క్రికెట్లో కూడా ఈ ఫైనల్ ను కొనసాగించాలని రోహిత్ కోరుకుంటున్నాడు.

గత ఏడాది జూన్ లో జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చారు. బసిల్ థంపీ, వాషింగ్టన్ సుందర్, దీపక్ హూడాలు మొదటిసారి ఆడనున్నారు. ఇందులో  హైదరాబాద్ ఆటో డ్రైవర్ కుమారుడు మహమ్మద్ సిరాజ్, బాసిల్ థంపీ మరియు జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ విశ్రాంతి తీసుకోవడంతో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రాపై బాధ్యత పడింది. కేరళ ఫాస్ట్ బౌలర్ థంపీ ఐపీఎల్ లో తానేంటో నిరూపించుకున్నాడు. స్పిన్నర్లుగా చాహల్, కుల్దీప్ స్థానాలకు ఢోకా లేదు.

టీమిండియా జట్టు సభ్యులు:  రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్. రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, దీపక్ హూడా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, బాసిల్ థంపీ, జయదేవ్ ఉనద్కట్

శ్రీలంక జట్టు సభ్యులు: థిసారా పెరెరా (కెప్టెన్), ఉపుల్ తరంగ, ఏంజెలో మాథ్యూస్, కుషాల్ పెరెరా, దనుష్క గుంతిల్క, నిరోషన్ డిక్వెలా, అసేలా గుణరత్నే,  స్దిర స్మృవిక్రమ,  దాసున్ స్నాక , చతురంగ డి సిల్వా, సచిత్ పతిరానా , ధనంజయ డి సిల్వా, నువాన్ ప్రదీప్, ఫెర్నాండో, దుష్మంత చామిరా.

Trending News