Ind vs Zim T20 Series: ఇండియా జింబాబ్వే తొలి టీ20 నేడే, పిచ్ రిపోర్ట్, హెచ్ టు హెడ్ రికార్డులు ఇలా

Ind vs Zim T20 Series: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన తరువాత టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటన ఇవాళ ప్రారంభమౌతోంది. అయితే సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి కొత్త జట్టును ఎంపిక చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇవాళ తొలి టీ20 జరగనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2024, 09:59 AM IST
Ind vs Zim T20 Series: ఇండియా జింబాబ్వే తొలి టీ20 నేడే, పిచ్ రిపోర్ట్, హెచ్ టు హెడ్ రికార్డులు ఇలా

Ind vs Zim T20 Series: టీ20 ప్రపంచకప్ 2024 విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ ఇండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ క్రీడాకారులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రానాలు తొలిసారిగా ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌తో ఓపెనింగ్ చేయనున్నాడు. 

శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌కు ఆ దేశానికి చేరుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్, సీనియర్లకు విశ్రాంతి నేపధ్యంలో టీమ్ ఇండియా పూర్తిగా కొత్తవారితో సిద్ధమైంది. శుభమన్ గిల్ కెప్టెన్‌గా , వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఇండియా-జింబాబ్వే సిరీస్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ తొలి టీ20 సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో వరుసగా 5 టీ20లు జరగనున్నాయి. సోనీ స్పోర్ట్స్‌లో ఇండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. సోనీ లివ్ యాప్‌లో కూడా మ్యాచ్‌లు వీక్షించవచ్చు. 

టీమ్ ఇండియా

శుభమన్ గిల్, రుతురాత్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా

జింబాబ్వే

బ్రియన్ బెన్నెట్, టి మరుమాని, సికందర్ రజా, జొనాథన్ క్యాంప్‌బెల్, అన్టుమ్ నఖ్వి, క్లైవ్ మదాండే, వెస్లీ మ్యాధ్యూవెర్, లూక్ జోంగ్వే, ఫరాజ్ అక్రమ్, వెల్లింగ్టన్ మసకాడ్జా, బ్లెస్సింగ్ ముజర్బానీ

పిచ్ రిపోర్ట్

ఈ ఏడాదిలో హరారేలో తొలి టీ20 ఇవాళ జరగనుంది. ఈ పిచ్‌పై గతంలో జరిగిన 12 మ్యాచ్‌లలో స్పిన్నర్లు 69 వికెట్లు తీయగా ఎకానమీ రేట్ 6.6గా ఉంది. ఇక పేసర్లు అయితే 80 వికెట్లు పడగొట్టారు. వర్షపు సూచన లేదు. ఇండియా-జింబాబ్వే మధ్య 8 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆరు టీమ్ ఇండియా గెలిస్తే రెండింట జింబాబ్వే గెలిచింది. 

Also read: Siraj Welcome: సిరాజ్‌ మియాకు హైదరాబాద్‌ గ్రాండ్‌ వెల్కమ్‌.. కానీ ప్రభుత్వమే?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News