India vs Afghanistan Series: టీమ్ఇండియాతో అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఖరారు- ఎప్పుడంటే?

India vs Afghanistan Series: రానున్న రెండేళ్లలో తమ టీమ్ ఆడనున్న దైపాక్షిక సిరీస్ లను ప్రకటించింది అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది మార్చిలో టీమ్ఇండియాతో వన్డే సిరీస్ ఆడనున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 01:29 PM IST
    • టీమ్ఇండియాతో అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ ఖరారు
    • వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్
    • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అఫ్గాన్ క్రికెట్ బోర్డు
India vs Afghanistan Series: టీమ్ఇండియాతో అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఖరారు- ఎప్పుడంటే?

India vs Afghanistan Series: వచ్చే ఏడాది మార్చిలో టీమ్ఇండియాతో వన్డే సిరీస్ ఆడనున్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను జారీ చేసింది. అందులో 2022-23లో తమ జట్టు ఆడనున్న దైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. 

అఫ్గాన్ క్రికెట్ జట్టు.. రానున్న రెండేళ్ల కాలంలో 11 వన్డే, 4 టీ20, రెండు టెస్టు సిరీస్​లు ఆడనుంది. అయితే, వచ్చే ఏడాది మార్చిలో భారత్​లో కూడా పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.  

"రానున్న రెండేళ్లలో 52 మ్యాచ్​లకు గానూ 37 వన్డే, 12 టీ20, 3 టెస్టు మ్యాచ్​లు ఆడుతుంది అఫ్గాన్ జట్టు. ఐసీసీ వన్డే సూపర్ లీగ్​లో భాగంగా 7 వన్డే సిరీస్​ల్లో పాల్గొంటుంది. వీటితో పాటు మేజర్ టోర్నీలైన ఆసియా కప్-2022 (టీ20 ఫార్మాట్), టీ20 ప్రపంచకప్-2022, ఆసియా కప్ 2023(వన్డే ఫార్మాట్), వన్డే ప్రపంచకప్​లు ఆడుతుంది" అని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

అయితే అఫ్గానిస్తాన్ జట్టు.. టీమ్ఇండియాతో పాటు నెదర్లాండ్స్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్​తో వచ్చే ఏడాది ద్వైపాక్షిక సిరీస్​లు ఆడుతుందీ జట్టు. మొత్తంగా 18 మ్యాచ్​లు స్వదేశంలో, 34 మ్యాచ్​లు విదేశాల్లో ఆడేందుకు అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రూపొందించింది.  

ALso Read: IND Vs SA Test Series: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ కు క్వింటన్ డికాక్ దూరం

Also Read: Kohli vs Rohit Rift: నీ కెప్టెన్సీలో నేనెందుకు ఆడుతా.. భారత జట్టులో మళ్లీ మొదలైన ఇగో ప్రాబ్లమ్స్!! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News