England vs India: టీమిండియాను ఆదుకున్న జడేజా.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతో తెలుసా?

India vs England 2nd T20I, India post 171 target to England. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ పోరాడే స్కోర్ చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 9, 2022, 09:30 PM IST
  • టీమిండియాను ఆదుకున్న జడేజా
  • ఇంగ్లండ్ టార్గెట్ ఎంతో తెలుసా?
  • మరోసారి నిరాశపరిచిన కోహ్లీ
England vs India: టీమిండియాను ఆదుకున్న జడేజా.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతో తెలుసా?

India post 171 target to England: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసి.. ఇంగ్లండ్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కష్టాల్లో పడిన టీమిండియాను ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (46; 29 బంతుల్లో 5 ఫోర్లు) ఆదుకున్నాడు. రోహిత్ శర్మ (31), రిషబ్ పంత్ (26) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అరంగేట్ర బౌలర్ రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్ బరిలోకి దిగారు. తొలి ఓవర్లోనే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ కాసేపు అలరించాడు. పంత్ కూడా ఫోర్లు బాదడంతోభారత్ స్కోర్ పరుగులు పెట్టింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 49 పరుగులు జత చేశారు. ఈ జోడీని రిచార్డ్ గ్లీసన్ విడదీశాడు. అద్భుత బంతికి రోహిత్  కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. రిచార్డ్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి పంత్ కూడా అదే రీతిలో పెవిలియన్ చేరాడు.

ఈ సమయంలో హార్దిక్ పాండ్యా (12) , సూర్యకుమార్ యాదవ్ (15) పరుగులు చేయలేకపోయారు. వీరిద్దరు జోర్డాన్ వేసిన 11వ ఓవర్లో వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. మరో వికెట్ పడకుండా ఆడిన దినేష్ కార్తీక్, రవీంద్రా జడేజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే హ్యారీ బ్రూక్ అద్భుత త్రోకు కార్తీక్ (12) రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో హర్షల్ పటేల్ (13) అండతో జడేజా వేగంగా పరుగులు చేశాడు. దాంతో భారత్ పోరాడే స్కోర్ చేసింది. 

Also Read: Bride Viral Video: వరుడి ముందే.. వధువును పెళ్లి చేసుకున్న ప్రియుడు! చివరికి..

Also Read: Eknath Shinde: శివసేన సంక్షోభానికి తెరదింపేందుకు ఠాక్రేతో చర్చిస్తున్నాం..షిండే సంచలన వ్యాఖ్యలు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News