లండన్‌లో భారత్ vs ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో.. చివరి టెస్ట్ ఆడుతున్న ఓపెనెర్ అలస్టర్ కుక్(71), మెయిన్ అలీ(50) రాణించారు. జెన్నింగ్స్ 23 పరుగులు , స్టోక్స్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం బట్లర్ (11), రషీద్ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు ఇషాంత్ శర్మ 3, బుమ్రా 2, జడేజా 2 వికెట్లు తీశారు. శనివారం రెండో రోజు ఆట కొనసాగనుంది. కాగా.. కుక్ మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో భారత ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి గార్డ్ ఆఫ్ హానర్‌తో స్వాగతించారు.
ఓపెనర్ కుక్ 71 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా కాగా.. మరో ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్ 23 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచిచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మరో ఆటగాడు రూట్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యుగా డకౌటయ్యాడు.
Great spell this is @Jaspritbumrah93 @ImIshant @MdShami11 pick of the bowler for me he has been unlucky so far today but sure he is gonna get the rewards.. india in control ✅🇮🇳 @BCCI vs @ECB_cricket
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 7, 2018
మెయిన్ అలీ 50 పరుగులు, బెయిర్ స్టో ఇద్దరూ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచిచ్చి పెవిలియన్ బాటపట్టరు. మరో ఆటగాడు కర్రెన్ కూడా ఇషాంత్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచిచ్చి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో బెన్ స్టోక్ (11పరుగులు) పెవిలియన్ చేరాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బట్లర్ 11 పరుగులు, రషీద్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.