భారత్, ఇంగ్లాండ్ సిరీస్ చూడడానికి వచ్చిన విజయ్ మాల్యా..!

లండన్‌లోని ది ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ను వీక్షించడానికి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వచ్చాడు. 

Last Updated : Sep 7, 2018, 09:38 PM IST
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ చూడడానికి వచ్చిన విజయ్ మాల్యా..!

లండన్‌లోని ది ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ను వీక్షించడానికి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వచ్చాడు. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోని ఈ రోజే పోస్టు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే విజయ్ మాల్యా.. టీమిండియా సారథి విరాట్ కోహ్లిని కలవాలని భావించారని..అందుకు అనుమతిని కోరుతూ భారత ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారని కూడా తెలుస్తోంది.

అయితే ప్రభుత్వం అందుకు అనుమతించలేదని కూడా వార్తలు వచ్చాయి. భారతదేశంలో పదిహేడు బ్యాంకులను ముంచి రూ.9 వేల కోట్ల అప్పులతో పరారైన విజయ్‌మాల్యా మీద ప్రస్తుతం అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవలే మాల్యాని ఆర్థిక నేరస్తుడిగా గుర్తించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమర్పించిన దరఖాస్తుకు జవాబిస్తూ.. సెప్టెంబర్‌ 24లోపు మాల్యా ఈ విషయానికి సంబంధించి వివరణ ఇవ్వాలని ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

ఈ క్రమంలో ప్రస్తుతం మాల్యా లండన్‌లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చారని వార్తలు రావడం గమనార్హం. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌లో ఇప్పటికే  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. తొలి రోజు టీ బ్రేక్ సమయానికి 59 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి జట్టు 123 పరుగులు చేసింది. 

Trending News