ఇండియా vs వెస్ట్ ఇండీస్ తొలి వన్డే: ఆదిలోనే శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్.. కోహ్లీ హాఫ్ సెంచరీ

ఇండియా vs వెస్ట్ ఇండీస్ తొలి వన్డే అప్‌డేట్స్

Last Updated : Oct 21, 2018, 10:49 PM IST
ఇండియా vs వెస్ట్ ఇండీస్ తొలి వన్డే: ఆదిలోనే శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్.. కోహ్లీ హాఫ్ సెంచరీ

గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా ఆదివారం విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆ జట్టు నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో ఒషానే థామస్ విసిరిన బంతికి ఓపెనర్ శిఖర్ ధవన్ 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ 11 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరును 82 పరుగులకు చేర్చారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 21 బంతుల్లో 18 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీకి వన్డే కెరీర్‌లో ఇది 49వ అర్ధ సెంచరీ కావడం విశేషం. హాఫ్ సెంచరీలలో హాఫ్ సెంచరీ కొట్టడానికి కోహ్లీ మరో హాఫ్ సెంచరీ దూరంలో మాత్రమే ఉన్నాడు.

Trending News