సఫారీలను కంగుతినిపించిన భారత క్రికెటర్లు ..!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయాన్ని నమోదు చేసింది.

Last Updated : Feb 2, 2018, 01:49 PM IST
సఫారీలను కంగుతినిపించిన భారత క్రికెటర్లు ..!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాని 6 వికెట్ల తేడాతో ఓడించిన కోహ్లీ సేన పరుగుల ధాటికి సఫారీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. లక్ష్యసాధనలో ‘కింగ్‌’ కోహ్లీ (112; 119 బంతుల్లో 10×4), మిడిలార్డర్‌లో అజింక్య రహానె (79‌; 86 బంతుల్లో 5×4, 2×6) అదరగొట్టే షాట్లతో క్రికెట్ అభిమానులను అలరించగా తమ ముందున్న 270 లక్ష్యాన్ని వారు అవలీలగానే చేరుకోగలిగారు. ముఖ్యంగా సఫారీ బౌలర్లను ఒక వైపు ఆడుకుంటూనే.. విరాట్ సేన దూకుడుగా భారీ షాట్లను కొట్టడమే పనిగా పెట్టుకుంది. కోహ్లీ, రహానే వికెట్లు పడ్డాక.. హార్దిక్‌ పాండ్య, ధోనీలు 45.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు తరఫున సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ (120; 112 బంతుల్లో 11×4, 2×6) ఒక్కడే శతకం నమోదు చేశాడు.  

Trending News