సత్తా చాటిన సన్ రైజర్స్.. ముంబయికి గట్టి దెబ్బ..!

ఐపీఎల్‌ 11లో మరో సూపర్ డూపర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. ముంబయి వాంఖడే మైదానంలో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో కేవలం బౌలర్ల హవా మాత్రమే కొనసాగింది. 

Last Updated : Apr 25, 2018, 12:26 AM IST
సత్తా చాటిన సన్ రైజర్స్.. ముంబయికి గట్టి దెబ్బ..!

ఐపీఎల్‌ 11లో మరో సూపర్ డూపర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. ముంబయి వాంఖడే మైదానంలో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో కేవలం బౌలర్ల హవా మాత్రమే కొనసాగింది.  ఇరు జట్ల బౌలర్లు కూడా తమదైన శైలిలో అద్భుతంగా రాణించారు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్లు కేవలం 119 పరుగులకే ఔట్ అయిపోతే.. ఆ తర్వాత లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ముంబయి కేవలం 18.4 ఓవర్లలో 87 పరుగులే చేయడం గమనార్హం. ముఖ్యంగా సిద్ధార్థ్‌ కౌల్‌ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ నడ్డి విరిచాడు.

తొలుత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ జట్టులో కూడా విలియమ్సన్‌ (29; 21 బంతుల్లో 5×4), యూసఫ్‌ పఠాన్‌ (29; 33 బంతుల్లో 2×4, 1×6) తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో బ్యాటింగ్‌లో రాణించలేదు 

సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ పూర్తి చేశాక బరిలోకి దిగిన ముంబయి క్రికెటర్ల పరిస్థితి కూడా దారుణంగానే తయారైంది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తాళలేక బ్యాట్స్‌మన్ అందరూ వరుసగా పెవిలియన్‌కి లైన్ కట్టేశారు. అలాగే పవర్‌ప్లేలో కేవలం 21 పరుగులలోపే ఔటయ్యారు.

అలాంటి సందర్భంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య కుమార్‌ యాదవ్‌ (34; 38 బంతుల్లో 4×4), కృనాల్‌ పాండ్యలు (24; 20 బంతుల్లో 4×4) కొంత మేరకు పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించారు. అయితే వారు కూడా ఔట్ అయ్యాక.. గేమ్ మొత్తం ఏక పక్షంగా సాగింది. కేవలం 87 పరుగులకే  జట్టు ఆలౌట్ అయ్యి సన్ రైజర్స్‌కి విజయాన్ని కట్టబెట్టింది.

Trending News