IPL 2024 Updates: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సెన్సేషన్ క్రియేట్ చేయడం బాగా ఆసక్తి. ఈసారి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపడే వార్తను షేర్ చేసింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను ట్రేడ్ విండో ద్వారా ఆర్సీబీ సొంతం చేసుకుందనేది ఆ వార్త సారాంశం. ఇదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది.
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు దేశమంతా ఐపీఎల్ సందడి ప్రారంభమైంది. ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిరోజుల్లో అంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఐపీఎల్‌లో భాగంగా ఉన్న పది ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాను ఇవాళ అంటే నవంబర్ 26 సాయంత్రం 4 గంటల్లోగా అందించాల్సి ఉంటుంది. మరోవైపు ఆటగాళ్ల ట్రేడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రానికి ఏ ఆటగాడు ఇన్, ఎవరు అవుట్ అనేది తేలిపోనుంది. ఇలాంటి సమయంలో ఆర్సీబీ చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ట్రేడ్ విండో సొంతం చేసుకున్నట్టుగా ఆర్సీబీ పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.
బాబర్ ఆజమ్ కోసం 500 టన్నుల ఆశీర్వాద్ గోధుమ పిండిని పాకిస్తాన్ దేశమంతటికీ అందిస్తామనేది ఆర్సీబీ చేసిన ట్వీట్. అదే సమయంలో టీమ్ ఇండియాలో రుతురాజ్ పాత్రే ఆర్సీబీలో బాబర్ ఆజమ్ పోషిస్తాడని పేర్కొంది. అంటే ఆర్సీబీ ఓపెనర్‌గా బాబర్ ఆజమ్ ఉండనున్నాడనేది ఆ ట్వీటీ సారాంశం. ఓ వైపు వరదలు, మరోవైపు ఆర్ధిక పరిస్థితులతో పాక్ ప్రజలు గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆశీర్వాద్ గోధుమ పిండిని బాబర్ ఆజమ్‌కు బదులుగా పాక్‌కు అందిస్తామని ట్వీట్ చేసింది.
ANNOUNCEMENT 🚨
We trade in @babarazam258 in exchange of 500 tonnes of aashirvaad atta for the whole nation of Pakistan, Welcome Babar!!
( Role - Same as Ruturaj has in Indian team )#NowARoyalChallenger #PlayBold pic.twitter.com/1TdFoNmHEv
— Royal Challengers Bangalore ☀️ (@theRCBtweets) November 25, 2023
వాస్తవానికి 2009 ముంబై దాడుల అనంతరం ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను బీసీసీఐ నిషేధించింది. ఈ క్రమంలో బాబర్ ఆజమ్ తమ జట్టుకు ఆడనున్నాడని ఆర్సీబీ పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీ ఓపెనింగ్ విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ కలిసి చేయనున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం కూడా చాలా కలివిడిగా ఉంటుంది. ఇద్దరూ స్పోర్టివ్ స్పిరిట్ కలిగి ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook