GT vs SRH: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. గ్లెన్ ఫిలిప్స్ ఔట్! తుది జట్లు ఇవే

GT vs SRH, Sunrisers Hyderabad have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : May 15, 2023, 07:25 PM IST
GT vs SRH: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. గ్లెన్ ఫిలిప్స్ ఔట్! తుది జట్లు ఇవే

Sunrisers Hyderabad opt to bowl: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మార్కో జాన్సెన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ మాత్రం రెండు మార్పులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఇప్పటివరకు మెగా టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే అధికారిక బెర్త్ దక్కించుకుంటుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింట్లో గెలిచి పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఉంటాయి. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్. 
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్. 

ఇంపాక్ట్ ప్లేయర్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, అకేల్ హోసేన్, మయాంక్ దాగర్, నితీష్ రెడ్డి. 
గుజరాత్ టైటాన్స్ సబ్స్: యష్ దయాల్, శ్రీకర్ భారత్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివం మావి. 

Also Read: సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!  

Also Read: MG Comet EV Bookings: ఎంజీ కామెట్ ఈవీ బుకింగ్స్ మొదలు.. మొదటి 5000 మందికి బంపర్ ఆఫర్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News