S Sreesanth in IPL 2023: శ్రీశాంత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లాంటి నేరానికి పాల్పడి క్రికెట్ నుంచి పూర్తిగా దూరమైనప్పటికీ.. అతడి పేస్ బౌలింగ్‌కి, అతడి అప్పీల్ స్టైల్‌కి ఫిదా అయిన అభిమానులకు మాత్రం కొదులే లేదు. అందుకే మళ్లీ క్రికెట్లో శ్రీశాంత్‌ని చూస్తే బాగుండును అని అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ లాంటిదే. అవును.. ఐపిఎల్ 2023 తో శ్రీశాంత్ మళ్లీ బ్యాక్ టు క్రికెట్ అంటున్నాడు. కాకపోతే శ్రీశాంత్‌కి ఈసారి ఎప్పటిలా మైదానంలోకి ఎంట్రీ లేదు. ఐపిఎల్ 2023 కామెంటరీ ప్యానెల్ ప్రకటించిన వివరాల ప్రకారం ఐపిఎల్ 2023 లో శ్రీశాంత్ కామెంటేటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఐపిఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభం కానుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి సమరం జరగనుంది. ఐపిఎల్ 2023 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రియులకు అంతకంటే ముందే ఓ బిగ్ అప్ డేట్ వచ్చింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్‌లో చిక్కుకున్న శ్రీశాంత్ మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఐపిఎల్ 2023 అధికారిక టెలికాస్ట్ పార్ట్ నర్ అయిన స్టార్ స్పోర్ట్స్, స్టార్ ప్లేయర్స్ తో కూడిన కామెంటేటర్స్ ప్యానెల్ జాబితాను ప్రకటించింది. ఈ కామెంటరీ ప్యానెల్‌లో టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పేరు కూడా ఉంది. కాకపోతే గతంలో మాదిరిగా బంతి చేతపట్టుకుని కాకుండా ఈసారి మైక్ చేతపట్టుకుని కనిపించనున్నాడు. అవును.. శ్రీశాంత్ తొలిసారిగా క్రికెట్ కామెంట్రీ చేస్తూ తన అభిమానులను అలరించనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ విజేతలైన జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన పాల్ కాలింగ్‌వుడ్, ఆరోన్ ఫించ్‌లను కూడా ఈ ప్యానెల్‌లో చేర్చారు. అరోన్ ఫించ్ మొత్తం 9 ఐపీఎల్ సీజన్స్ ఆడిన విషయం తెలిసిందే. అలాగే ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా వీరితో కలిసి ఆడియెన్స్ ని ఆకట్టుకోనున్నాడు.