LSG vs MI IPL 2023 Eliminator: టాస్ గెలిచిన ముంబై.. యువ స్పిన్నర్ వచ్చేశాడు!

IPL 2023 Eliminator Lucknow vs Mumbai Playing 11 Out. ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : May 24, 2023, 07:27 PM IST
LSG vs MI IPL 2023 Eliminator: టాస్ గెలిచిన ముంబై.. యువ స్పిన్నర్ వచ్చేశాడు!

LSG vs MI IPL 2023 Eliminator Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ఎలిమినేటర్‌ మ్యాచ్ ఆరంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పు చేసింది. కారికేయ స్థానంలో షోకీన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ ఓపెనర్ కైల్ మేయర్స్ తుది జట్టులోకి వస్తాడనుకున్నా అది జరగలేదు. 

ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళుతుంది. కాబట్టి విజయమే లక్ష్యంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ బరిలోకి దిగనున్నాయి. గెలిచిన జట్టు ఐపీఎల్ 2023 ఫైనల్లో చోటు కోసం గుజరాత్‌ టైటాన్స్ జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో పోటీపడుతుంది. బ్యాటింగ్‌లో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌ పరంగా లక్నోదే కాస్త పైచేయిగా ఉంది. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ లక్నో గెలిచింది. మరి చెపాక్‌లో ఏ జట్టు జయకేతనం ఎగురవేస్తుందో చూడాలి.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్. 
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), యష్‌ ఠాకూర్‌, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్‌), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొసిన్ ఖాన్. 

డ్రీమ్11 టీమ్:
వికెట్ కీపర్లు: నికోలస్ పూరన్, ఇషాన్ కిషన్
బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్
ఆల్ రౌండర్లు: మార్కస్ స్టోయినిస్ (వైస్ కెప్టెన్), కెమెరూన్ గ్రీన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్)
బౌలర్లు: రవి బిష్ణోయ్, పీయూష్ చావ్లా, నవీన్-ఉల్-హక్. 
Also Read: Simple One Electric Scooter: సింపుల్‌ వన్‌ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 212 కిమీ ప్రయాణం!

Also Read: Second Hand Car Benfits: సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల కలిగే ఈ 4 ప్రయోజనాలు మీకు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

 

Trending News