Rohit Sharma Sixes: రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు.. డివిలియర్స్ రికార్డు బద్దలు

MI Vs GT IPL 2023 Live Updates: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లలో రెండోస్థానానికి చేరుకున్నాడు. గుజరాత్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. క్రిస్ గేల్‌ మొదటి స్థానంలో ఉన్నాడు.

Written by - Ashok Krindinti | Last Updated : May 12, 2023, 10:28 PM IST
Rohit Sharma Sixes: రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు.. డివిలియర్స్ రికార్డు బద్దలు

MI Vs GT IPL 2023 Live Updates: ప్లే ఆఫ్‌కు చేరే క్రమంలో ముంబై ఇండియన్స్‌ నేడు బిగ్‌ ఫైట్‌కు రెడీ అయింది. గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ ప్లేస్‌ ఉండగా.. ముంబై నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. గుజరాత్ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడితే.. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పక నెగ్గాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ ఆరంభించింది. ఈ సీజన్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. గుజరాత్‌పై మ్యాచ్‌లో కాస్త టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. 

పవర్‌ప్లేలో కెప్టెన్ రోహిత్, ఇషాన్ కిషన్ కలిసి 61 పరుగులు జోడించాడు. 7వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చాడు. 18 బంతుల్లో 29 రన్స్ చేసిన రోహిత్ శర్మ.. రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ ఓ ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రికార్డును బద్ధలు కొట్టాడు. 

స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి రోహిత్ సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ సిక్సర్ల సంఖ్‌య 252కి చేరింది. డివిలియర్స్ 251 సిక్సర్లను దాటేశాడు. ఐపీఎల్ హిస్టరీ‌లో 357 సిక్సర్లతో క్రిస్ గేల్ టాప్‌ప్లేస్‌లో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (239 సిక్సర్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు.
       ఆటగాడు         ఐపీఎల్‌లో సిక్సర్లు
==> క్రిస్ గేల్                  357
==> రోహిత్ శర్మ             252
==> ఏబీ డివిలియర్స్    251
==> ఎంఎస్ ధోని            239

ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ముందు ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (31), విష్ణు వినోద్ (30) పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి.. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. 

Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News