CSK Captain MS Dhoni 22 runs away to complete 5000 Runs in IPL: క్రికెట్ మెగా లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 రంగం సిద్ధమైంది. మండు వేసవిలో రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా అందించే ఐపీఎల్ 16వ సీజన్ నేడు తెరలేవనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుండగా.. అంతకుముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుక కోసం క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్యాష్ రిష్ లీగ్ ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయి అందుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో 5000 పరుగులు (MS Dhoni 5000 Runs) పూర్తి చేసేందుకు ధోనీకి కేవలం 22 పరుగులు కావాలి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచులో ధోనీ 22 రన్స్ చేస్తే.. ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేస్తాడు. అప్పుడు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎలైట్ లిస్టులో మహీ చేరతాడు. ధోనీ ప్రస్తుతం 234 మ్యాచులో 4978 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 84 కాగా.. 24 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కేవలం 6 మంది బ్యాటర్లు మాత్రమే 5,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 6,624 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (6,244 పరుగులు), డేవిడ్ వార్నర్ (5,881 పరుగులు), రోహిత్ శర్మ (5,879 పరుగులు), సురేష్ రైనా (5,528 పరుగులు), ఏబీ డివిలియర్స్ (5,162 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన వచ్చే ఎంఎస్ ధోనీ.. ఇప్పటివరకు ఐపీఎల్‌లో సెంచరీ సాధించలేదు. 6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేసే ధోనీకి ఎక్కువగా బంతులు ఆడే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. ఫినిషర్ పాత్ర పోషించే మహీ.. మూడు-అంకెల మార్కును సాధించడం కష్టమే. అయినా కూడా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే వారికీ ధీటుగా పరుగులు చేస్తున్నాడు. ఓ ఫినిషర్ 5 వేళా రన్స్ చేయడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.
Also Read: MS Dhoni Impact Player: చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ప్లాన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.