IPL 2023 Final: ముంబై ఇండియన్స్ IPL 2023లో ఫైనల్ చేరడం కష్టమే.. SRH మాజీ కోచ్‌ కీలక వ్యాఖ్యలు!

Former SRH coach Tom Moody slams Mumbai Indians: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరడం కష్టమే అని టామ్‌ మూడీ జోస్యం చెప్పాడు. 

Written by - P Sampath Kumar | Last Updated : Apr 7, 2023, 07:54 PM IST
IPL 2023 Final: ముంబై ఇండియన్స్ IPL 2023లో ఫైనల్ చేరడం కష్టమే.. SRH మాజీ కోచ్‌ కీలక వ్యాఖ్యలు!

Mumbai Indians Not to Reach IPL 2023 Final: రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌ 2022లో తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. వరుస ఓటములను ఎదుర్కొని ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. ఐపీఎల్ 2023లో కూడా పేలవ ప్రదర్శనతోనే మెగా టోర్నీని ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పలువురు ముంబై జట్టుపై సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ జాబితాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ చేరాడు. 

ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరడం కష్టమే అని టామ్‌ మూడీ జోస్యం చెప్పాడు. 'ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనపై ఆందోళన చెందుతున్నా. నేను ఐపీఎల్‌ 2023 ప్రారంభానికి ముందు కూడా ఇదే చెప్పాను. ముంబై జట్టు ఫైనల్‌ వరకు చేరుకుంటుందని నేను అనుకోవడం లేదు. జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. సమతుల్యత లోపించింది. మ్యాచ్‌లో అన్ని స్థానాల్లో మెరుగ్గా బౌలింగ్‌ చేసే దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు లేరు. విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ వారికి సమతుల్యత లేదు' అని మూడీ జోస్యం చెప్పాడు. 

Also Read: Maruti Suzuki Grand Vitara Price: కస్టమర్లకు షాక్.. ఈ మారుతి కారుపై రూ. 30 వేలు పెరిగింది!

ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ టోర్నీలో ఓ చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. మెగా టోర్నీలో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలిచింది. ముంబైతో మ్యాచ్ అంటే అన్ని జట్లు వణికిపోయేవి. అలాంటి జట్టు ఇటీవలి కాలంలో పేలవంగా ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ వీక్ అయింది. జట్టులో మ్యాచ్‌ విన్నర్లు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం రావడం లేదు. ఇలానే ఆడితే ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్ సంగతి మర్చిపోవాల్సిందే. ఇక ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఏప్రిల్ 8న సొంత మైదానంలో చెన్నైతో తలపడనుంది.

Also Read: Best SUV under 6 Lakh: టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కోనేయండి! ధర తక్కువ మైలేజ్ ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News