Virat Kohli in Green Jersey: సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) రాణించారు. మిగిలిన బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా రాణించలేదు. ఇక ఈ మ్యాచ్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ గోల్డెన్ డౌకౌట్ అయ్యాడు. మొదటి బంతికి ట్రెండ్ బౌల్ల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు పంపించాడు.
ఎన్నో అంచనాలతో క్రీజ్‌లోకి విరాట్ కోహ్లీ రాగా.. భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు అనుకున్నారు. అయితే తొలి బంతికే డకౌట్ అయి నిరాశపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ రోజు మ్యాచ్‌కు గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగింది. గత సీజన్లోనూ విరాట్ కోహ్లీ గ్రీన్ డ్రెస్‌లో ఆడినప్పుడు కూడా తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని జగదీష్ సుచిత్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీని ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. ఇది బౌల్ట్‌కు వందో ఐపీఎల్ వికెట్ కావడం గమనార్హం.
ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి.. మూడింటిలో ఓడిపోయింది. నేడు రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో ముందడగు వేయాలనుకుంటోంది. టాస్ ఓడి సొంతగడ్డపై అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. గత మ్యాచ్‌లో మాదిరే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మాత్రమే ఆడారు. 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డుప్లెసిస్ 62 రన్స్ చేయగా.. 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మ్యాక్స్‌వెల్ 77 రన్స్ చేశాడు.
Also Read: TTD Fake Websites: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ వెబ్‌సైట్‌ను నమ్మొద్దు.. ఇలా గుర్తించండి
వీరిద్దరు ఆడడంతోనే బెంగుళూరు స్కోరు 189 పరుగులు చేయగలిగింది. దినేశ్ కార్తీక్ (16) మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండెంకెల స్కోరు దాటలేకపోయారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు, అశ్విన్, చాహల్ చెరో వికెట్ తీశారు. 190 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే సిరాజ్ షాక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ డకౌట్ చేశాడు. రాజస్థాన్ ప్రస్తుతం లక్ష్యం వైపు దూసుకుపోతుంది.
Also Read: IPL 2023 Updates: కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ ఇదేం బ్యాటింగ్ భయ్యా..! స్ట్రైక్ రేట్ ఏది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి