జొహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి టీ20లో కొహ్లీసేన 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే..! ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన ఫీల్డింగ్ తో అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా ఫీల్డింగ్ కు క్రికెట్ అభిమానులు మంత్రముగ్దులయ్యారు.
సఫారీ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను ఆపే ప్రయత్నంలో బుమ్రా బౌండరీ లైన్ వద్ద చేసిన ఫీట్ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. టీమిండియా బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని మిల్లర్ షాట్ కొట్టాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ లో ఉన్న బుమ్రా బంతిని పట్టుకొనేందుకు గాల్లోకి ఎగిరాడు.
Airborne BOOM! How's that for an effort at the boundary ropes! #SAvIND pic.twitter.com/dz4ubi4qiV
— BCCI (@BCCI) February 18, 2018
ఇటీవల క్రికెట్ లో మార్చిన నిబంధనల ప్రకారం తొలుత ఒకసారి బౌండరీ లైన్ తాకి ఆపై గాల్లో క్యాచ్ పట్టి విసిరేసినా అది సిక్సర్ గానే పరిగణిస్తారు. దీంతో బుమ్రా ఒకింత నిరాశకు గురయ్యాడు. అయినా బుమ్రా చేసిన అద్భుతమైన ఫీల్డింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు.
Good effort! pic.twitter.com/v8FyMwepxA
— Cricket Videos (@cricvideos11) February 18, 2018