IPL 2023 Free Live streaming: మార్చి 3 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ 2023 కోసం వేచిచూస్తున్న క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ రానేవచ్చింది. ఐపిఎల్ ప్రియులకు 16వ ఐపిఎల్ టోర్నమెంట్‌ని లైవ్ స్ట్రీమింగ్ లో ఉచితంగా వీక్షించేందుకు జియో సినిమా అవకాశం అందించనుంది. 2023 ఐపిఎల్ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ బిడ్డింగ్ లో జియో సినిమా లైవ్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ భాషలు అన్నీ కలిపి మొత్తం 11 భాషల్లో జియో సినిమా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
ఐపిఎల్ 2023 శాటిలైట్ రైట్స్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మీడియా హౌజ్ సొంతం చేసుకోగా లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ వయాకామ్ 18 జియో సినిమా కొనుగోలు చేసింది. లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న జియో సినిమా.. తమ యూజర్స్‌కి ఉచితంగా ఐపిఎల్ టోర్నమెంట్ వీక్షించే ఛాన్స్ అందివ్వాలని భావిస్తోంది.
ఐపిఎల్ 2023 ని ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా భారీ సంఖ్యలో సబ్‌స్క్రిప్షన్స్ పెంచుకోవడంతో పాటు ఆ తరువాత కూడా మిగతా కాంపిటీటర్స్ కి గట్టి పోటీని ఇచ్చేలా భారీ సంఖ్యలో యూజర్ బేస్ పెంచుకోవచ్చు అని జియో సినిమా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా ఐపిఎల్ 2023 టోర్నమెంట్ ని ఉచితంగా వీక్షించే అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి ఐపిఎల్ 2023 మ్యాచ్‌లను మరింత ప్రత్యేకం చేసేలా వివిధ కోణాల్లో, ఎప్పటికంటే భిన్నంగా విభిన్నమైన రీతిలో.. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ హైక్వాలిటీ విజువల్స్ ఎంజాయ్ చేసేలా మ్యాచ్‌ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జియో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది . అందుకోసం భారీ సంఖ్యలో అత్యాధునిక కెమెరాలు, మరింత హైడెఫినిషన్, హై క్వాలిటీ లెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్టు సమాచారం. ఆడియన్స్ మ్యాచ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మార్చేయాలని జియో సినిమా భావిస్తోంది.
ఇది కూడా చదవండి : IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఆసుపత్రి బెడ్‌పై టీమిండియా స్పీడ్ స్టార్
ఇది కూడా చదవండి : IPL 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
ఇది కూడా చదవండి : Chetan Sharma Resigns: సెలెక్టింగ్ కమిటీ చైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా, వెంటనే ఆమోదం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook