KL Rahul COVID 19: కేఎల్ రాహుల్‌కు కరోనా పాజిటివ్.. వెస్టిండీస్‌ పర్యటనకు దూరం!

KL Rahul test positive for Covid 19. భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డాడు. బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్న రాహుల్‌కు కరోనా పాజిటివ్ అని బీసీసీఐ పేర్కొంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 21, 2022, 10:22 PM IST
  • కేఎల్ రాహుల్‌కు కరోనా పాజిటివ్
  • వెస్టిండీస్‌ పర్యటనకు దూరం
  • భారత మహిళా ప్లేయర్‌కు కూడా
KL Rahul COVID 19: కేఎల్ రాహుల్‌కు కరోనా పాజిటివ్.. వెస్టిండీస్‌ పర్యటనకు దూరం!

KL Rahul test positive for Covid 19: భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డాడు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్న రాహుల్‌కు కరోనా సోకిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలియజేశారు. గురువారం ముంబైలో జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ విషయాన్ని దాదా చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత మహిళా జట్టులోని ఓ ప్లేయర్‌ కూడా కోవిడ్-19తో బాధపడుతున్నారని గంగూలీ పేరొన్నారు. అయితే ఆటగాడి పేరును మాత్రం వెల్లడించలేదు.

ఐపీఎల్ 2022 తర్వాత కేఎల్ రాహుల్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సారథిగా ఆడాల్సి ఉన్నప్పటికీ.. గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వాల్సి వచ్చింది. ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. జర్మనీ వెళ్లి గాయానికి చికిత్స తీసుకుని వచ్చిన రాహుల్.. ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నాడు. వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమయ్యేలోపే కరోనా బారిన పడ్డాడు. 

విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కేఎల్ రాహుల్‌ చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. జూలై 29 నుంచి పొట్టి సిరీస్ ఆరంభం కానుండగా.. అప్పటిలోగా రాహుల్ కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే టోర్నిలో ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే గాయం కారణంగా సతమతమవుతున్న రాహుల్.. టోర్నీ ఆరంభం లోగా కరోనా నుంచి కోలుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. 

మరోవైపు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే భారత జట్టుకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో వన్డేలకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం జడ్డు మోకాలి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో అతడిని ఒక మ్యాచ్‌కే దూరం పెట్టాలా లేదా వన్డే సిరీస్‌ నుంచి తప్పించాలనేది బీసీసీఐ వైద్య బృందం త్వరలో తేల్చనుంది.  రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌లకు వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వడంతో.. శిఖర్ ధావన్‌, రవీంద్ర జడేజాలు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. 

Also Read: Malavika Mohanan Pics: పొట్టి డ్రెస్సులో మాళవిక మోహనన్ అందాల ట్రీట్.. అంతా కనపడేలా రోడ్డెక్కిందిగా!

Also Read: రిషబ్ పంత్ మోడల్‌గా మారితే.. కోట్లు సంపాదిస్తాడు! అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News