ఇండియా vs న్యూజీలాండ్ తొలి వన్డే మ్యాచ్: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

ఆస్ట్రేలియాలో సిరీస్ సొంతం చేసుకున్న జోష్‌తో వున్న టీమిండియా... న్యూజిలాండ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది.

Last Updated : Jan 24, 2019, 12:33 PM IST
ఇండియా vs న్యూజీలాండ్ తొలి వన్డే మ్యాచ్: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

నేపియర్: ఆస్ట్రేలియాలో సిరీస్ సొంతం చేసుకున్న జోష్‌తో వున్న టీమిండియా... న్యూజిలాండ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ మూడు వికెట్లు తీసి తమ ప్రతాపాన్ని చూపించారు. కివీస్ ఆటగాళ్ల మెయిన్ వికెట్స్ తీసి వారిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడంలో కుల్దీప్, షమి కీలక పాత్ర పోషించారు. న్యూజీలాండ్ ఆటగాళ్లలో కెప్టేన్ కేన్ విలియమ్సన్ (64) బాధ్యతతో ఆడి జట్టు స్కోర్‌ని ఆ మాత్రం స్థాయికి చేర్చాడు. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు విలియమ్సన్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన అనంతరం కివీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాటపట్టించారు.

న్యూజీలాండ్‌ని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసి లంచ్ బ్రేక్ కన్నా ముందుగానే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో సునాయసంగానే ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (75 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా కెప్టెన్ విరాట్ కోహ్లి 45 పరుగులు చేశాడు. తొలి వన్డేలోనే విజయం సాధించడం ద్వారా 5 వ‌న్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది.

Trending News