Mitchell Starc gets injured in IND vs AUS 3rd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఆటపై తకున్న మక్కువను మరోసారి చాటుకున్నాడు. వేలి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. స్టార్క్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్.. స్టార్క్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 'కమిట్‌మెంట్ అంటే ఇదేరా అయ్యా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 156/4తో రెండో రోజు (గురువారం) ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 41 పరుగులు జతచేసి చివరి 6 వికెట్లను కోల్పోయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్స్ తీయగా.. ఉమేశ్ యాదవ్, ఆర్ అశ్విన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60) హాఫ్ సెంచరీ చేశాడు.
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన అనంతరం.. భారత్ రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్‌ను ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ వేశాడు. స్టార్క్ బంతిని వేసిన అనంతరం అతడి ఎడమ చేతి చూపుడు వేలు నుంచి రక్తం కారుతుంది. రక్తాన్ని తన ప్యాంట్‌కు తుడుచుకుని బౌలింగ్‌ను కొనసాగించాడు. ఇందుకు సంబందించిన దృశ్యాలు టీవీల్లో కనిపించాయి. 2022 చివరి నుంచి స్టార్క్‌ను ఈ గాయం వేధిస్తూనే ఉంది. అప్పటినుంచి పలుమార్లు అదే గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.
— Vaishnavi Iyer (@Vaishnaviiyer14) March 2, 2023
మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పూర్తి పట్టు సాధించింది. మొదటి రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా నిరాశపరిచారు. 118 పరుగులకే భారత్ ఆరు వికెట్స్ కోల్పోయింది. 40.1 ఓవర్లకు భారత్ స్కోర్ 118/6. చేతేశ్వర్ పుజారా (45) ఒక్కడే పోరాడుతున్నాడు. భారత్ ప్రస్తుతం 30 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆర్ అశ్విన్ క్రీజులో నిలబడితేనే భారత్ పోరాడే స్కోర్ చేయగలుగుతుంది. చూడాలి మరి ఏం చేస్తాడో.
Also Read: Tata Nexon Price: 90 వేల డౌన్ పేమెంట్‌తో టాటా నెక్సన్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.