ఇండియా vs వెస్ట్ ఇండీస్ వన్డే సిరీస్ : చివరి 3 వన్డేల్లో ఆడనున్న జట్టు ఇదే

షమీకి విశ్రాంతి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు ఛాన్స్! 

Last Updated : Oct 25, 2018, 08:48 PM IST
ఇండియా vs వెస్ట్ ఇండీస్ వన్డే సిరీస్ : చివరి 3 వన్డేల్లో ఆడనున్న జట్టు ఇదే

ప్రస్తుతం సొంత గడ్డపై విండీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి మూడు వన్డేలకు బీసీసీఐ టీమిండియా జట్టు ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాలో బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు  కొత్తగా చోటు దక్కగా మొహమ్మద్ షమీకి విశ్రాంతి లభించింది. బీసీసీఐ ప్రకటించిన వివరాల ప్రకారం ఇకపై జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌లకు సిద్ధం కానున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.

టీమిండియా జట్టు సభ్యులు:
విరాట్ కోహ్లీ (కెప్టేన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిశబ్ పంత్, ఎం.ఎస్. ధోని (వికెట్ కీపర్), రవింద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మెద్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే.

More Stories

Trending News