ఏదేమైనా బ్యాట్స్‌మన్‌ని స్టంప్ ఔట్ చేయడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టైలే వేరు. అందులో అతడికి ఇంకెవ్వరు పోటీ లేరు. అతడిలా స్టంప్ ఔట్ చేయాలన్నా.. వేల సంఖ్యలో పరుగులు సాధించాలన్నా మరో ఏడు జన్మలు ఎత్తాల్సిందే. ఇది మహేంద్ర సింగ్ ధోనీ అభిమాని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్‌కి ఘాటుగా ఇచ్చిన సమాధానం. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ల మధ్య ఎవరో ఒక్కరినే ఎంచుకోవాల్సి వస్తే, మీరైతే ఎవరిని ఎంచుకుంటారు అంటూ మైఖెల్ వాన్ ట్విట్టర్‌లో నిర్వహించిన ఓపెన్ పోల్‌కి భారీ స్పందన కనిపించింది. క్రికెట్ ప్రపంచంలో శిఖరం లాంటోడు ధోనీకి, జోస్ బట్లర్‌కి పోలిక ఏంటంటూ మైఖెల్ వాన్‌కి వాతలు పెట్టినంత పనిచేశారు ధోనీ అభిమానులు.
Intrigued what you all think...You are allowed 1 of these 2 now in your team... Who you going for on present form !??
— Michael Vaughan (@MichaelVaughan) January 22, 2018
Dhoni is GOD. Jos is good but he is just a human. It will take him 7 more births to stump as fast as Dhoni and score over 15000 runs with almost 50 average
— Sunderdeep Singh (@SSunderdeep) January 22, 2018
Talking about current form.
Jos might have scored a century recently but MS averages 60.62 in 2017. Hope that answers your “current form”. Let’s not talk about stumpings here. Before u blink your eye, he stumps the batsman on the field.— Jay Jadwani🏏 (@diehard_msdian) January 22, 2018
Present form, previous form, out of form, full form, even if he is retired I would choose @msdhoni
— Sunny🐒 (@sunil_ss7) January 22, 2018
Here is one more poll for you sir. Who was a better batsman ? Hey India, please vote 😊
— The-Lying-Lama (@KyaUkhaadLega) January 23, 2018
The comparison made by English batsman is wrong bcoz firstly @josbuttler have to play for England as many matches as @msdhoni has played as a captain of #India
— Shubham Gupta (@BunkerGupta) January 24, 2018
R u mad Michael what is this comparison dhoni is cricket God no body can reach
— Rk Botany (@botany_rk) January 24, 2018
ఇండియన్ క్రికెట్ గాడ్ ధోనీకి ఆటలో బచ్చగాడు లాంటోడు బట్లర్‌కి మధ్య పోలిక ఏంటంటూ మైఖెల్ వాన్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తనకు ట్విటర్‌లో ఇండియన్స్ ఇచ్చిన సమాధానాలకి మైఖెల్ వాన్‌కి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అంతేకాదు.. ఇంకెప్పుడూ ఓ భారతీయుడికి, ఇంగ్లాండ్ క్రికెటర్‌కి మధ్య పోలింగ్ పెట్టకూడదు అంటూ తనకు తానే బుద్ధి చెప్పుకుంటున్నట్టుగా మరో ట్వీట్ పోస్ట్ చేశాడు మైఖెల్ వాన్. దటీజ్ ధోనీ.. మహేంద్ర సింగ్ ధోనికి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్.
Note to self .... Never run a poll asking people to choose an England player over an Indian Player on here ... !!!!! #OnOn
— Michael Vaughan (@MichaelVaughan) January 22, 2018