MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ని కెప్టెన్‌గా నడిపించిన ధోనీ(MS Dhoni).. ఆ జట్టుకు నాలుగో సారి ట్రోఫీని అందించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)తో శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్న చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) గెలవగానే మైదానంలోకి వచ్చిన సాక్షి, జీవా.. ఆనందంతో ధోనీని హత్తుకున్నారు. ఆ సమయంలో సాక్షి(Sakshi) వేసుకున్న డ్రెస్ ఆధారంగా ఆమె మళ్లీ గర్భవతి(Pregnant) అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. దాంతో.. స్పందించిన సురేశ్ రైనా(Suresh Raina) భార్య ప్రియాంక.. 2022లో సాక్షి మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది. ఈ విషయంపై ధోని దంపతులు అధికారికంగా వెల్లడించలేదు. ధోనీ ఫ్యామిలీతో సురేశ్ రైనా దంపతులకి మంచి అనుబంధం ఉంది. ఎంతలా అంటే..? 2015లో జీవా(ziva) పుట్టిన న్యూస్ మొదట రైనాకే సాక్షి చెప్పి.. ధోనీకి చెప్పమనేంతలా! మొత్తంగా.. 2022 నాటికి జూనియర్ ధోనీ రాబోతున్నాడంటూ ధోనీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
Also read: MS Dhoni Record: కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించిన ఎంఎస్ ధోని
మహేంద్రసింగ్ ధోనీ, సాక్షి 2010, జులై 4న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015, ఫిబ్రవరి 6న జీవా జన్మించింది. 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం కేవలం ఐపీఎల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్(ICC T20 World cup 2021) జరగనుండగా.. ఈ మెగా టోర్నీకి టీమిండియా మెంటార్‌గా ధోనీ వ్యవహరించబోతున్నాడు.
Also read: IPL 2021 Title Winner: ఐపీఎల్ టైటిల్ అర్హత ఆ జట్టుకే ఉంది, ధోనీ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook