Nepal will play in Asia Cup 2023 for the First Time: ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఆసియా కప్ ను పాకిస్థాన్, శ్రీలంకలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనూ, మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు.
ఈసారి ఈ టోర్నీలో ఓ కొత్త జట్టు ఆడనుంది. పైగా ఆ టీమ్ ను భారత్, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లు ఉన్న గ్రూప్ లో వేశారు. అదే నేపాల్ క్రికెట్ జట్టు. ఖాట్మండులోని టీయూ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ ఫైనల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించడం ద్వారా నేపాల్ జట్టు ఆసియా కప్ లో స్థానం దక్కించుకుంది. 1984 నుంచి ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరగబోయేది 16వ ఎడిషన్. తొలిసారి నేపాల్ ఈ టోర్నీలో పాల్గొంటుంది.
Also Read: BAN vs AFG: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ ప్రపంచ రికార్డు... ఏకంగా 546 పరుగుల తేడాతో విజయం..
ఈ సారి ఆసియా కప్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. రెండు గ్రూపుల నుంచి తలో రెండు జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. అందులో టాప్ 2 నిలిచిన టీమ్స్ పైనల్స్ ఆడతాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగబోతుంది. ఇందులో భారతదేశం, పాకిస్తాన్ మరియు నేపాల్ జట్లు ఒక గ్రూపులో, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మరో గ్రూపులో ఉండబోతున్నాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు 2-2 మ్యాచ్‌లు ఆడి... సూపర్-4కు చేరుకుంటుంది. అక్కడ ఒక్కో జట్టు 3-3 మ్యాచ్‌లు ఆడతాయి. టాప్-2 జట్లు ఫైనల్స్ ఆడతాయి. ప్రపంచ కప్ కు ముందు సన్నాహక పరంగా ఆసియా కప్ చాలా ముఖ్యమైన టోర్నమెంట్.
Also Read: ICC Odi World Cup 2023: రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం.. రెండు స్థానాల కోసం 10 జట్లు పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి