15 మ్యాచ్‌లు.. 26 స్పాట్ ఫిక్సింగ్స్: ఆరోపించిన నివేదిక

15 మ్యాచ్‌లు.. 26 స్పాట్ ఫిక్సింగ్స్: ఆరోపించిన నివేదిక

Last Updated : Oct 22, 2018, 02:25 PM IST
15 మ్యాచ్‌లు.. 26 స్పాట్ ఫిక్సింగ్స్: ఆరోపించిన నివేదిక

క్రికెట్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌లపై శోధన చేస్తున్న అల్ జజీరా ఛానెల్ పిడుగు లాంటి వార్తను వెల్లడించింది. పలువురు అంతర్జాతీయ ప్రముఖ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అల్ జజీరా తన రెండో డాక్యుమెంటరీ ద్వారా వెల్లడించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తెలిపింది. క్రికెట్‌లో అవినీతి తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించిన సదరు టీవీ ఛానల్ లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపించింది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడిన ఏడు మ్యాచ్‌లు, ఆసీస్ ప్లేయర్లు ఆడిన ఐదు మ్యాచ్‌లు, పాక్ ఆటగాళ్లు ఆడిన మూడు మ్యాచ్‌లు, మరో జట్టు ఆటగాళ్లు ఆడిన ఓ మ్యాచ్ ఫిక్స్ అయినట్టు ఆరోపించింది అల్ జజీరా ఛానెల్. 2011-12 మధ్య జరిగిన ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు వరల్డ్ టీ20 మ్యాచ్‌ల్లో 26 స్పాట్ ఫిక్సింగ్స్‌ జరిగినట్లు..అల్ జజీరా ఛానెల్ ఆదివారం తన డాక్యుమెంటరీ ద్వారా తెలిపింది.

ఇంగ్లాండ్, భారత్ మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో పాటు కేప్ టౌన్‌లో జరిగిన సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా, యూఏఈలో జరిగిన ఇంగ్లండ్-పాక్ మ్యాచ్‌లలో కూడా స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించింది.

విరాట్, రోహిత్ ఫోటో

ఈ ఏడాది మేలో ప్రసారమైన అల్ జజీరా మొట్టమొదటి డాక్యుమెంటరీ 'క్రికెట్ మ్యాచ్లు-ఫిక్సర్స్'లో మునావర్ మ్యాచ్ ఫిక్సర్‌గా గుర్తించబడ్డాడు. ఇతను దావూద్ ఇబ్రహీంకి చెందిన' డి-కంపెనీ' సభ్యుడు.

'2012లో శ్రీలంకలో టీ20 వరల్డ్ కప్ సందర్భంగా మునావర్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లతో మాట్లాడాడు. అంతేకాదు, మునావర్ తన సహచరులతో కలిసి ఉన్న ఫోటో‌గ్రాఫ్‌లు, అక్కడ దిగిన ఫోటోలు కూడా మా వద్ద ఉన్నాయి.' అని రిపోర్టులో నివేదించింది. అయితే ఈ  ఆటగాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నట్లు సూచనలేవీ లేవంది.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు భారత ఆటగాళ్లు సునాష్ రైనా, లక్ష్మీపతి బాలాజీ, ఆండీ బిచెల్, ఆస్ట్రేలియన్ కోచ్‌లతో దిగిన ఫోటోలను మునావర్ ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం, మునావర్ అనుచరుడు బ్యాగ్‌ను పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు ఇస్తున్నట్లు ఫోటో ఉందని.. అయితే ఆ క్రికెటర్ బ్యాగ్‌ను తీసుకున్నాడో లేదో ఆ ఫోటో చూపించలేదని పేర్కొంది.  

కాగా స్పాట్ ఫిక్సింగ్ ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న అల్ జజీరా తమకు సహకరించాలని ఐసీసీ కోరింది.

Trending News