Ind Vs NZ Toss: టాస్ గెలిచిన కివీస్.. టీమిండియాలో కీలక మార్పు

Ind Vs NZ Squad: భారత్-కివీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభమైంది. నేపియర్ వేదికగా చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.

Last Updated : Nov 22, 2022, 02:33 PM IST
Ind Vs NZ Toss: టాస్ గెలిచిన కివీస్.. టీమిండియాలో కీలక మార్పు

Ind Vs NZ Squad: టీమిండియా-న్యూజిలాండ్ జట్లు చివరి టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీమిండియా.. మంగళవారం మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఇక రెండో టీ20 భారత్ అద్భుత విజయం సాధించింది. ఇక చివరి మ్యాచ్ అయినా మూడో టీ20లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు బరిలోకి దిగాయి. మంగళవారం నేపియర్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య పోరు ఆరంభమైంది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ఇక మెడికల్ అపాయింట్‌మెంట్ ఉండటంతో కివీస్ రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 

వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నేపియర్‌లో చినుకులు కురువడంతో టాస్‌ ఆలస్యమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని కివీస్ భావిస్తోంది.

ఇక తుది జట్టులో చోటు ఆశించిన శుభమన్ గిల్, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లకు మరోసారి నిరాశ తప్పలేదు. గత ఓపెనర్ ఇషాన్ కిషాన్ పర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. దీంతో పంత్ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేశారు. అదేవిధంగా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు కూడా చివరి టీ20లో అయినా ఛాన్స్ ఇవ్వాలని మాజీలు సూచించారు. అయితే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాత్రం కేవలం ఒక మార్పుతోనే బరిలోకి దిగాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నాడు.

జట్లు ఇలా: 

భారత్: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, టిమ్ సౌథీ (కెప్టెన్), ల్యూకీ ఫెర్గూసన్.
 

Trending News