Sachin Record: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ లాథమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
24 ఏళ్ల సచిన్ రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును చెరిపేశాడు. పుట్టిన రోజు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నెదర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో లాథమ్ 123 బంతుల్లో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కష్టాల్లో పడిన జట్టును ఒంటి చేత్తో నిలబెట్టి...గెలిపించాడు. అతడు 30వ ఏటలోకి అడుగు పెట్టాడు.
మరోవైపు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ 1998 షార్జా కప్‌లో ఆసీస్‌పై 134 పరుగులు చేశాడు. 131 బంతను ఎదుర్కొని 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. అతడికి అది 25వ పుట్టిన రోజు. ఆ రోజు టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సచిన్ అప్పట్లో పుట్టిన రోజు అత్యధిక స్కోర్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. తాజాగా లాథమ్ దాన్ని అధిగమించి..మెరుగైన రికార్డును నమోదు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో టెయిలెండర్లతో కలిసి లాతమ్ పోరాడాడు. చివరికి జట్టు స్కోర్ ను 264 పరుగులకు తీసుకెళ్లాడు. అనంతరం నెదర్లాండ్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Also read: Maxwell Join RCB: ఆర్సీబీ శిబిరంలో చేరిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook