BAN vs ZIM No Ball: చివరి ఓవర్‌లో హైడ్రామా.. గతంలో ఎప్పుడూ చూడని 'నో బాల్'!

T20 World Cup 2022 Bangladesh vs Zimbabwe: Netizens Says never seen this type of No Ball. జింబాబ్వే vs బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన చివరి బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 30, 2022, 03:12 PM IST
  • చివరి ఓవర్‌లో హైడ్రామా.
  • గతంలో ఎప్పుడూ చూడని 'నో బాల్'
  • నో బాల్ రూపంలో గెలిచే అవకాశం ఉన్నా
BAN vs ZIM No Ball: చివరి ఓవర్‌లో హైడ్రామా.. గతంలో ఎప్పుడూ చూడని 'నో బాల్'!

No Ball video goes Viral in Bangladesh vs Zimbabwe Clash in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం జింబాబ్వే, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో జింబాబ్వే ఓడిపోయింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓ‍వర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్‌ సీన్ విలియమ్స్ (64) హాఫ్ సెంచరీతో పోరాడినా.. చివరి బంతికి అనూహ్యంగా ఓడిపోయింది. నో బాల్ రూపంలో గెలిచే అవకాశం ఉన్నా.. చేజేతులారా మిస్ చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే  69 పరుగులకు 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో సీన్ విలియమ్స్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.  చకబ్వా (15), ర్యాన్ బర్ల్ (26) విలియమ్స్ కు అండగా నిలిచారు. బర్ల్, విలియమ్స్ పోరాటంతో జింబాబ్వే  విజయానికి చేరువగా వచ్చింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. 

మొసాద్దిక్ వేసిన చివరి ఓవర్ తొలి బంతి లెగ్‌ బై వెళ్లింది. రెండో బంతికి బ్రాడ్ ఇవాన్స్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. మూడో బంతికి లెగ్‌ బై రూపంలో నాలుగు పరుగులొచ్చాయి. నాలుగో బంతిని ఎన్‌గరవ సిక్స్‌ బాదాడు. ఐదో బంతిని భారీ షాట్ ఆడటానికి క్రీజ్‌ను వదిలి ముందుకు రావడంతో.. ఎన్‌గరవ స్టంపౌట్ అయ్యాడు. దాంతో జింబాబ్వే విజయ సమీకరణం ఒక బంతికి 5 రన్స్ చేయాల్సి వచ్చింది. చివరి బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన ముజరబని కూడా స్టంపౌట్ అయ్యాడు. దాంతో బంగ్లా ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. 

బంగ్లా ప్లేయర్స్ ఆనందంలో ఉండగా.. అంపైర్ భారీ షాకిచ్చాడు. చివరి బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. మొసాద్దిక్ వేసిన చివరి బంతిని అందుకునే సమయంలో కీపర్ నూరుల్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి ముందుకొచ్చాయి. దాంతో అంపైర్ నో బాల్‌గా ఇచ్చేశాడు. ఇంకేముంది బంగ్లా ప్లేయర్స్ టెన్షన్ పడగా.. జింబాబ్వే ఆటగాళ్లు ఆనందంతో మైదానంలోకి వచ్చారు. చివరి బంతికి 4 రన్స్ చేయాలి. మొసాద్దిక్ వేసిన ఫ్రీహిట్ బంతికి ముజరబని షాట్ ఆడినా.. బంతి బ్యాటును కనెక్ట్ కాలేదు. జింబాబ్వే ఓడిపోయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. కీపర్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి వచ్చిన సమయంలో నో బాల్‌గా ప్రకటిస్తారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇలాంటి 'నో బాల్'ని గతంలో ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: IND vs SA Weather Report: భారత్‌-దక్షిణాఫ్రికాకు ఒక్కో పాయింట్‌.. కారణం ఇదే!

Also Read: CM KCR: చంద్రబాబు బాటలోనే సీఎం కేసీఆర్.. మోడీ సర్కార్ ఏం చేయబోతోంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News