ODI World Cup 2023: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు 'గోల్డెన్ టికెట్'.. దీని స్పెషల్ ఏంటంటే?

Golden ticket: 2023 వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగనున్న నేపథ్యంలో గోల్డెన్ టికెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ఇందులో భాగంగా మంగళవారం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ టికెట్ ను బీసీసీఐ సెక్రటరీ జై షా అందజేశారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2023, 08:22 PM IST
ODI World Cup 2023: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు 'గోల్డెన్ టికెట్'.. దీని స్పెషల్ ఏంటంటే?

Golden ticket WC 2023: భారత్ వేదికగా అక్టోబరు 05 నుంచి వన్డే ప్రపంచకప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బీసీసీఐ గోల్డెన్ టికెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా..దేశంలోని సెలెబ్రిటీలకు గోల్డెన్ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ టికెట్ ను బీసీసీఐ సెక్రటరీ జై షా అందజేశారు. ఈ విషయాన్ని బీసీసీ తమ అధికారిక  ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించింది. ఇప్పటికే ఈ గోల్డెన్ టికెట్ ను పొందినవారిలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండ్యూలర్ ఉన్నారు. ఈ టికెట్ ను పొందినవారు మ్యాచులన్నింటినీ వీఐపీ గ్యాలరీలో కూర్చుని ఫ్రీ వీక్షించవచ్చు. వీరికి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. 

ఐసీసీ పురుషుల వన్డే వరల్ట్ కప్ అక్టోబరు 05 నుంచి నవంబరు 19 వరకు జరుగుతుంది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబరు 08న తలపడనుంది. మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకుని ఆసియా కప్ లో అదరగొట్టిన కేఎల్ రాహుల్ కు జట్టులో చోటు లభించింది. 

ప్రపంచ కప్ కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్

Also Read: IND vs AUS: ఆసీస్‌తో వన్డే సిరీస్​కు కెప్టెన్‌గా రాహుల్.. అక్షర్ ఔట్, అశ్విన్ ఇన్.. ఆ ముగ్గురికి రెస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News