World Cup 2023: త్వరలో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ ఆడుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ప్రపంచమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు మిస్ కానున్నారా..అవుననే సమాధానం వస్తోంది.
2023 ప్రపంచకప్‌లో అత్యంత రసవత్తరమైన ఘట్టం ఉండకపోవచ్చు. ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ ఆడకపోవచ్చు. రెండ్రోజుల క్రితం పాకిస్తాన్ క్రీడా శాఖ మంత్రి ఇషాన్ మజారీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆసియా కప్ 2023లో హాజరయ్యేందుకు ఇండియా తమ దేశానికి రాకుంటే..వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్‌ను ఇండియాకు పంపించమని ఆయన స్పష్టం చేయడమే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే...పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2023లో భద్రతను కారణంగా చూపిస్తూ ఇండియా తప్పుకుంది. పాకిస్తాన్‌లో టోర్నీ నిర్వహిస్తే హాజరుకామని, తటస్థ వేదికైతే ఆడతామని హైబ్రిడ్ మోడల్‌ను ఇండియానే తెరపైకి తీసుకొచ్చింది బీసీసీఐ.
వన్డే ప్రపంచకప్ 2023 విషయంలో పాకిస్తాన్ ఇప్పుడదే అస్త్రాన్ని సంధిస్తోంది. ఆసియా కప్ 2023 కు ప్రతిపాదించినట్టుగా ప్రపంచకప్ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలు కేటాయించాలని పాకిస్తాన్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ స్పష్టం చేశారు. తటస్థ వేదికలైతేనే పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంటుందని లేకపోతే పంపించమని స్పష్టం చేశారు. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీకు ముందు నుంచీ బీసీసీఐపై ఆరోపణ ఉంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనికబోర్డుగా ఉన్న బీసీసీఐ చెప్పిందే జరుగుతోందని, నిధుల కారణంగా ఏ క్రికెట్ బోర్డు బీసీసీఐకు ఎదురుచెప్పడం లేదనేది పీసీబీ వాదన. పాకిస్తాన్ ఇప్పుడు ఈ సమస్యకు సమాధానం కోసం ఐసీసీని ఆశ్రయిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ ఆడకపోతే ఏం జరగనుందనేది పరిశీలిద్దాం..
వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాకిస్తాన్ ఒకవేళ తప్పుకుంటే ఆ స్థానంలో మరో జట్టుకు అవకాశమిస్తారు. అంటే ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్న స్కాట్లండ్ జట్టుకు అవకాశం లభిస్తుంది. జింబాబ్వేతో మ్యాచ్ తరువాత స్కాట్లండ్ మూడవ స్థానంలో నిలిచింది. అంటే పాకిస్తాన్ స్థానంలో స్కాట్లండ్ ఇండియాతో తలపడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook