PAK vs ENG Live Updates: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఆరంభమైంది. పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు మెల్‌బోర్న్ వేదికగా తలపడుతున్నాయి. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి పాక్ ఫైనల్‌కు చేరుకోగా.. ఇండియాపై విజయంతో ఇంగ్లండ్ తుది పోరుకు అర్హత సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. సెమీ ఫైనల్లో తలపడిన ఆటగాళ్లతోనే రెండు జట్లు బరిలోకి దిగాయి.
ఇప్పటివరకు టీ20ల్లో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. తొమ్మిదింటిలో పాక్ గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. T20 ప్రపంచకప్‌లో ఈ జట్లు రెండుసార్లు ముఖాముఖి తలపడగా.. రెండింటిలోనూ ఇంగ్లండ్ జట్టునే విజయం వరించింది. సెమీస్‌లో కనబరిచిన జోరునే ఫైనల్లోనూ కొనసాగించాలని రెండు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు.
మెల్‌బోర్న్ పిచ్ బౌలర్లకు బౌన్స్, పేస్‌కు సహకరిస్తుంది. ప్రారంభ ఓవర్లు ముగిసిన తర్వాత బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 160 పరుగుల లక్ష్యం విధించినా.. కష్టమే అవుతుంది. ఆకాశం మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉంది.
అయితే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం సూచన ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ నేడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. సోమవారం రిజర్వ్ డే రోజు నిర్వహిస్తారు. రెండోరోజు కూడా వర్షం కురిస్తే.. రెండు జట్లను జగజ్జేతలుగా ప్రకటిస్తారు. ఇప్పటికే మెల్‌బోర్న్‌కు అభిమానులు భారీగా చేరుకున్నారు. వర్షం రాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు.
తుది జట్లు:
పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, శ్యామ్ కర్రన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్
Also Read: Bansuwada Woman Death: ఫేస్‌బుక్‌లో యువకుడితో ప్రేమ.. భర్తను వదిలి వెళ్లిపోయిన మహిళ.. ఊహించని షాక్
Also Read: Dallas Airshow: డల్లాస్ ఎయిర్ షోలో విషాదం.. ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook