అబుదాబిలో పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన 2వ వన్డేలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. న్యూజీలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్య్యూసన్ విసిరిన బంతిని ఎదుర్కునే క్రమంలో పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. పేసర్ విసిరిన బంతి వేగంగా వచ్చి ఇమామ్ ముఖానికి తగిలింది. ఇమామ్ హెల్మెట్ ధరించినప్పటికీ.. బంతి వేగంగా వచ్చి తగలడంతో ఆ వేగం ధాటికి ఇమామ్ ముఖానికి గాయమైంది. వెంటనే క్రీజులోంచి బయట కుప్పకూలిపోయిన ఇమామ్ ఉల్ హఖ్‌ని మ్యాచ్ నిర్వాహకులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ICYMI: Imam-ul-Haq has been taken to the hospital for scans after he was hit on the helmet earlier #PAKvNZ pic.twitter.com/hHsg8JYSAC
— Cricingif (@_cricingif) November 9, 2018