PV Sindhu Dance: పీవీ సింధు డ్యాన్స్‌.. రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు!

PV Sindhu shakes a leg with Gomi Gomi song. మలేషియా ఓపెన్ 2022 కోసం ఫారిన్ వెళ్లిన పీవీ సింధు అక్కడి ట్విన్ టవర్స్‌ ముందు డ్యాన్స్ చేసి అందరిని అలరించింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 4, 2022, 03:30 PM IST
  • పీవీ సింధు డ్యాన్స్‌
  • రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు
  • కలర్‌ఫుల్ ఫోటోషూట్స్ చేస్తూ
PV Sindhu Dance: పీవీ సింధు డ్యాన్స్‌.. రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు!

PV Sindhu shakes a leg for Gomi Gomi song in Malaysia: ఒలింపిక్స్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా ఓపెన్ 2022 క్వార్టర్స్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్స్‌లో సెకండ్ సీడ్, చైనీస్ తైపీ క్రీడాకారిణి టై జు యింగ్ చేతిలో ఓటమి చవిచూసింది. 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తెలుగు తేజం సింధు 13-21, 21-15, 21-13 తో ఓడింది. దాంతో మలేషియా ఓపెన్ నంచి నిష్క్రమించింది. టోర్నీ కోసం మలేషియాకు వెళ్లిన సింధు తెగ ఎంజాయ్ చేస్తోంది. మలేషియాలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తుంది.

మలేషియా ఓపెన్ 2022 కోసం ఫారిన్ వెళ్లిన పీవీ సింధు అక్కడి ట్విన్ టవర్స్‌ ముందు మోడ్రన్ డ్రెస్‌లో హీరోయిన్‌ రేంజ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు ట్విన్ టవర్స్‌ ముందు డ్యాన్స్ చేసి అందరిని అలరించింది. గుమిగో మిగోమి రీమీక్స్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ ఈ వీడియోకు.. మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో, అది చేయాలి అని  సింధు ట్యాగ్‌లైన్ ఇచ్చింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

తెలుగు తేజం పీవీ సింధు పోస్ట్ చేసిన వీడియోకి ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది లైక్ చేశారు. మరోవైపు వేల సంఖ్య‌లో కామెంట్లు వ‌చ్చాయి. సింధు డాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రపంచ ఛాంపియన్ గతంలో కచ్చాబాదం, మాయాకిర్రియే, బీస్ట్ అరబిక్‌ కుతు తదితర పాటలకు స్టెప్పులేసి అలరించింది. సింధు స్పోర్ట్స్‌ స్టార్‌గానే కాకుండా ..డ్యాన్సులు, కలర్‌ఫుల్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్‌గా మారుతుంది. 

Also Read: ఇంగ్లండ్ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డు.. ఈసారి భువనేశ్వర్‌ రికార్డు బ్రేక్!

Also Read: Sharad Pawar: మహా'డ్రామా' మళ్లీ మొదలయ్యేనా..ఏక్‌నాథ్‌ వర్గంపై శరద్‌ పవార్ ఏమన్నారంటే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News