PV Sindhu Dance Video: గ్రౌండ్‌లో ఆటే కాదు..ఫ్లోర్‌పై డ్యాన్స్ కూడా, తగ్గేదే లే అంటున్న పీవీ సింధు

PV Sindhu Dance Video: ఆటే కాదు డ్యాన్స్ కూడా ప్రాణమే అంటోంది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవి సింధు. ట్రెండింగ్‌లో ఉన్న ఆ పాటకు స్టెప్పులేసి హల్‌చల్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2022, 08:56 AM IST
  • బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ వేసిన పీవీ సింధు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పీవీ సింధు డ్యాన్స్‌కు అభిమానుల ఫిదా, వీడియో వైరల్
  • ఒక్కరోజులేనే 2 లక్షలకు పైగా లైక్స్
 PV Sindhu Dance Video: గ్రౌండ్‌లో ఆటే కాదు..ఫ్లోర్‌పై డ్యాన్స్ కూడా, తగ్గేదే లే అంటున్న పీవీ సింధు

PV Sindhu Dance Video: ఆటే కాదు డ్యాన్స్ కూడా ప్రాణమే అంటోంది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవి సింధు. ట్రెండింగ్‌లో ఉన్న ఆ పాటకు స్టెప్పులేసి హల్‌చల్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

దేశం గర్వించదగ్గ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో పాటు సామాజిక మాధ్యమంలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. విభిన్న రకాల పోస్టులతో అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పీవీ సింధూ చాలా యాక్టివ్. కేవలం రెండ్రోజుల ముందు నెమలికి ఆహారం తిన్పిస్తున్న చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు ఏకంగా 1 లక్షా 31 వేల లైక్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు మరో చిన్న వీడియో పోస్ట్ చేసి..వైరలవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

కోర్ట్‌లో ఆటే కాదు..ఇంట్లో స్టెప్పులు కూడా వేస్తానంటోంది. ఆటే కాదు డ్యాన్స్ కూడా ప్రాణమంటోంది. తనలో ఆటతో పాటు డ్యాన్స్ ప్రావీణ్యం కూడా ఉందని నిరూపిస్తోంది. తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో ట్రెండింగ్ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. అరబిక్ కుతు ట్రాక్ ప్రస్తుతం సంచలనం రేపిన పాట. ఆ పాటకు ఇంట్లో టెర్రాస్‌పై హుషారుగా స్టెప్పులేసి..అందర్నీ ఆశ్చర్యపర్చింది పీవీ సింధు. బ్లూ టైట్ జీన్స్ వేసి..తెల్లటి షర్ట్ ఇన్ చేసి...స్టెప్పులేస్తోంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో షేర్ చేయగానే అభిమానులు విపరీతంగా స్పందించారు. కేవలం ఒక్కరోజులోనే 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. గ్రౌండ్‌లో ఆటే కాదు..ఫ్లోర్‌పై స్టెప్పులు కూడా...తగ్గేదే లే అంటోంది సింధు.

Also read: Kieron Pollard Retirement: కిరెన్ పొల్లార్డ్ రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో పొల్లార్డ్ ఫ్యాన్స్ పీవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x