'#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా, నానా పాటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఈ ఉద్యమం మొదలైంది. సినిమా రంగానికి పరిమితం కాకుండా మీడియా, రాజకీయ, క్రీడా రంగాలకూ వ్యాపించింది. '#మీటూ' ఉద్యమంలో మహిళలు తమకు ఎదురైనా చేదు అనుభవాలను, అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు.
అయితే భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఈ వివాదంలో చిక్కుకోకుండా తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ఇది రాహుల్ యవ్వన దశలో ఉన్నప్పుడు, కెరీర్ తొలినాళ్లలో జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
ఆ వీడియో ప్రకారం.. ఓ హోటల్ గదిలో ద్రవిడ్ ఉన్నప్పుడు అక్కడికి ఓ యువతి వచ్చింది. ద్రవిడ్ ముందుకు పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఆమె మరింత చనువుగా ఉండేందుకు ప్రయత్నం చేసింది. ద్రావిడ్ పెళ్లికి నిరాకరించాడు. అక్కడి నుంచి లేచి, వెళ్లబోయాడు. దీంతో బయట వేచి ఉన్న తన యువతి తండ్రిని గదిలోకి వచ్చి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేయగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించలేదు.
కానీ ద్రవిడ్ మాత్రం 20 ఏళ్ల వయసులో చదువు, కెరీర్‌పై దృష్టి సారించాలని, అనవసర విషయాల జోలికి వెళ్లవద్దంటూ ఆ యువతికి హితబోధన చేసి పంపించివేశారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ క్రికెట్‌కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో రాహుల్ ద్రావిడ్‌ది ప్రత్యేక స్థానం. ద్రవిడ్‌ను మిస్టర్‌వాల్‌గా, మిస్టర్ డిపెండబుల్‌గా పిలుచుకుంటారు. ఆయన టీం ఇండియా అండర్ 19 టీమ్ కోచ్ ఉన్నారు.
1973 జనవరి 11 న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన రాహుల్ ద్రవిడ్ 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గ్రేట్ వాల్‌గా పేరు పొందిన రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపును పొందారు.అంతేకాదు కెరీర్‌లో 10 వేల పరుగులను వన్డేలలో, టెస్టులో పూర్తి చేసిన ప్రపంచ మూడవ ఆటగాడు. 2004లో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ద్రవిడ్.. అదే ఏడాది పద్మశ్రీ, 2013లో పద్మ భూషణ్‌చే సత్కరించబడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి..