Mumbai Indians get off the mark on Rohit Sharma's birthday: ఎట్టకేలకు ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. శనివారం రాత్రి ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపొందింది. రాజస్థాన్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (51; 39 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీ చేయగా.. తిలక్ వర్మ (35; 30 బంతుల్లో 1x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. డేనియల్ సామ్స్ సూపర్ సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. జస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, ఆర్ అశ్విన్, వై చహల్ తలో వికెట్ పడగొట్టారు.
రాజస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ (2) ఆర్ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆపై సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (24) పరుగులు చేసేందుకు కాస్త కష్టపడ్డారు. కుదురుకుంటున్న సమయంలో ఆరో ఓవర్లో ఇషాన్ పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో తిలక్ వర్మతో కలిసి సూర్య ముంబై ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి ముంబైని విజయం వైపు తీసుకెళ్లారు.
అర్ధ శతకం సాధించిన తర్వాత యుజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు. అదే స్కోర్ వద్ద తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన టీమ్ డేవిడ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 9 బంతుల్లో 20 రన్స్ చేశాడు. అయితే హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ నెమ్మదిగా ఆడి చివరి ఓవర్ మొదటి బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి డానియల్ సామ్స్ సిక్స్ బాది ముంబైకి తొలి విజయాన్ని అందించాడు. నేడు కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు కాబట్టి ఈ విజయాన్ని బర్త్‌డే బాయ్‌కు ఎంఐ ఆటగాళ్లు గిఫ్ట్‌గా ఇచ్చారు.
First win in the bag - Congratulations to #MI who have beaten #RR by 5 wickets 👏👏#RRvMI | #TATAIPL | #IPL2022 pic.twitter.com/MDPru1K4pj
— IndianPremierLeague (@IPL) April 30, 2022
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగుల సాదారణ స్కోర్ చేసింది. కనీసం 180 పరుగులు చేస్తుందని అనిపించిన రాజస్థాన్ జట్టును ముంబై బౌలర్లు ఇన్నింగ్స్ చివరలో దెబ్బకొట్టారు. ఓపెనర్ జొస్ బట్లర్ (67; 52 బంతుల్లో 5x4, 4x6) హాఫ్ సెంచరీ చేసినా కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరలో రవిచంద్రన్ అశ్విన్ 9 బంతుల్లో 21 రన్స్ చేశాడు. దేవదత్ పడిక్కల్ (15), సంజూ శాంసన్ (16), డారియల్ మిచెల్ (17) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మెరెడిత్, హృతిక్ షోకీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read: Ketika Sharma Hot Images: సాఫ్ట్ గ్లామ్ అంటూ.. కుర్రాకారుని కవ్విస్తున్న కేతిక శర్మ!
Also Read: Vaani Kapoor Pics: పూలచెట్ల మధ్య వాణీ కపూర్.. అందమే అసూయ పడుతోందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook