ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ సెమీస్ ఎవరెవరికంటే..టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి

ICC T20 World Cup 2021 చివరి అంకానికి చేరుతోంది. సెమీఫైనల్స్ రౌండ్‌కు బెర్త్‌లు ఖరారయ్యాయి. టీమ్ ఇండియా సెమీస్ ఆశలు నీరుగారిపోగా..నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఇంకా మిగిలుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 8, 2021, 06:04 AM IST
  • టీ20 ప్రపంచకప్ 2021 లో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు గల్లంతు
  • టీ20 ప్రపంచకప్ 2021లో సెమీఫైనల్స్ బెర్త్‌లు ఖరారు
  • ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్, పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియాల మధ్య రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌లు
ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ సెమీస్ ఎవరెవరికంటే..టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి

ICC T20 World Cup 2021 చివరి అంకానికి చేరుతోంది. సెమీఫైనల్స్ రౌండ్‌కు బెర్త్‌లు ఖరారయ్యాయి. టీమ్ ఇండియా సెమీస్ ఆశలు నీరుగారిపోగా..నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఇంకా మిగిలుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో(ICC T20 World Cup 2021)టీమ్ ఇండియా కధ ముగిసింది. నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ మిగిలున్నా సెమీస్ ఆశలు మాత్రం నీరుగారాయి. నమీబియాతో మ్యాచ్ అనంతరం ఇక ఇండియా ఇంటికి చేరనుంది. అటు సెమీఫైనల్స్‌లో ఎవరెవరు చేరుకున్నారు, ఎవరు ఎవరితో తలపడనున్నారనేది కూడా ఖరారైంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి ఉంటే టీమ్ ఇండియా ఆశలు కాస్త సజీవంగా ఉండేవి. కానీ న్యూజిలాండ్(NewZealand) విజయంతో ఇక ఇండియా సెమీస్ నుంచి దూరమైపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌పై విజయంతో న్యూజిలాండ్ తన సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. 

గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఇప్పటికే సెమీఫైనల్స్‌కు(T20 World Cup Sem finals) చేరుకున్నాయి. గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ దేశాలు సెమీస్‌కు చేరాయి. ఇక సెమీఫైనల్స్ మ్యాచ్‌లు రెండూ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనున్నాయి. గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్‌కు గ్రూప్ 1 సెకండ్ టాపర్ ఆస్ట్రేలియాకు మధ్య సెమీఫైనల్స్ దుబాయ్ వేదికగా నవంబర్ 11వ తేదీన జరగనుంది. అటు గ్రూప్ 2 సెకండ్ టాపర్ న్యూజిలాండ్‌కు  గ్రూప్ 1 టాపర్ ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీఫైనల్స్ అబుదాబి వేదికగా నవంబర్ 10వ తేదీన జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకే జరగనున్నాయి. నవంబర్ 8వ తేదీన జరగనున్న ఇండియా(Team India)-నమీబియా మ్యాచ్ ఫలితంతో సెమీపైనల్స్ బెర్త్‌లకు ఇక ఏం సంబంధం లేదు. 

Also read: Watch Video: కివీస్ ఆటగాడు అద్భుత ఫీల్డింగ్..క్యాచ్ విడిచిపెట్టినా హీరో అయ్యాడంటూ నెటిజన్స్ కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News