Shoaib Akhtar dropped from his Biopic The Rawalpindi Express: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన రాబోయే బయోపిక్ 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' నుంచి తప్పుకున్నాడు. బయోపిక్‌తో పాటు చిత్ర బృందంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుంటున్నట్లు అక్తర్ శనివారం ఓ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ఈ బయోపిక్‌ను కొనసాగించినా లేదా తన పేరును ఉపయోగించినా లేదా తన జీవితానికి సంబంధించిన ఘటనలను వాడుకున్నా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ మాజీ పేసర్ హెచ్చరించాడు.
2022 జులైలో పాకిస్థాన్ (Pakistan) మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ జీవితం ఆధారంగా ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్ -రన్నింగ్ అగనెస్ట్ ది ఆడ్స్’ (Rawalpindi Express-Running Against The Odds) చిత్రాన్ని ప్రకటించారు. మోషన్ పోస్టర్‌ను కూడా అక్తర్ స్వయంగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాను 2023 నవంబర్ 13న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. శనివారం (2023 జనవరి 21) సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు అక్తర్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. అంతేకాదు తన సినిమా తీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
'ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. చాలా రోజులు ఆలోచించిన తర్వాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ నుంచి వైదొలుగుతున్నాను. ఇది నా కలల ప్రాజెక్ట్ కాబట్టి.. ఇందులో కొనసాగడానికే ప్రయత్నించాను. దురదృష్టవశాత్తు అనుకున్నట్లు జరగలేదు. ఒప్పంద ఉల్లంఘనలు జరిగాయి. సామరస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ సినిమాతో నా బంధాన్ని తెంచుకున్నా. చట్టపరమైన అన్ని నిబంధనలు పాటించిన తర్వాతనే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగా. ఈ బయోపిక్‌ను కొనసాగించినా లేదా నా పేరును ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవు' అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
Important announcement. pic.twitter.com/P7zTnTK1C0
— Shoaib Akhtar (@shoaib100mph) January 21, 2023
మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) పాకిస్తాన్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. క్రికెట్‌లో అక్తర్ పడగొట్టిన వికెట్ల కంటే.. వేగంగా సంధించే బంతుల ద్వారానే ఎక్కువగా పేరు సంపాదించుకున్నాడు. క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రికార్డు (161.3 కిలోమీటర్లు) అక్తర్ పేరిట ఉంది. అందుకే అతడిని ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అని అంటారు. 20 సంవత్సరాలుగా ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదు.
Also Read: Rohit Sharma Form: కొంతకాలంగా పెద్ద స్కోర్లు చేయలేదు.. రోహిత్ శర్మ తన ఫామ్ గురించి ఏమన్నాడంటే?
Also Read: Old Pension Scheme: ఆ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ విధానంపై సీఎం కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.