Shubman Gill Crush on Rashmika Mandhana: సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్ కాదు.. శుభమాన్ గిల్ క్రష్‌ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

India Crickter Shubman Gill Reveals His Crush, Not Sara Ali Khan and Sara Tendulkar. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తన క్రష్ అని టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ తెలిపాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 9, 2023, 03:48 PM IST
  • సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్ కాదు
  • శుభమాన్ గిల్ క్రష్‌ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
  • గిల్‌కు చోటు దక్కుతుందో లేదో
Shubman Gill Crush on Rashmika Mandhana: సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్ కాదు.. శుభమాన్ గిల్ క్రష్‌ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Shubman Gill Crush on Rashmika Mandhana, Not Sara Ali Khan and Sara Tendulkar: గత రెండేళ్లుగా టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గిల్ తన ఆటతో కాకుండా.. డేటింగ్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముందుగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కూతురు సారా టెండుల్కర్‌తో గిల్‌  డేటింగ్ అంటూ వార్తలు షికార్లు చేశాయి. ఆపై బాలీవుడ్‌ యువ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌తో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ విషయాలపై అటు గిల్ కానీ.. ఇటు సారా టెండుల్కర్‌, సారా అలీ ఖాన్‌ కానీ స్పందించలేదు. 

తాజాగా శుభ్‌మాన్ గిల్ తన క్రష్‌ ఎవరో చెప్పాడు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తన క్రష్ అని గిల్ తెలిపాడు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్నా గిల్‌కు మీరు ఎక్కువగా ఇష్టపడే నటి ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు శుభ్‌మాన్ నవ్వుతూ సమాధానం దాటవేసే పయత్నం చేశాడు. అది కుదరకపోవడంతో.. రష్మిక మందన్నపై తనకు క్రష్ ఉందని చెప్పాడు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ ఆడుతోంది. శుబ్‌మాన్ సమాధానంపై రష్మిక ఇంకా స్పందించలేదు. దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గత సంవత్సరం శుభమాన్ గిల్, సారా అలీ ఖాన్ పేర్లు సోషల్ మీడియాలో పలుసార్లు ట్రెండింగ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీ, పబ్, రెస్టారెంట్‌ అంటూ షికార్లు కొట్టడమే ఇందుకు కారణం. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో సారా, గిల్ డిన్నర్‌ చేస్తున్న ఫొటోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అప్పటినుంచి గిల్ మరియు సారా డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ప్రస్తుతానికి తమ రిలేషన్‌షిప్ గురించి ఇద్దరు స్పందించలేదు. ఆటతో గిల్, సినిమాలతో సారా బిజీబిజీగా ఉన్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో శుభ్‌మాన్ గిల్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టులో చోటు దక్కించుకోని గిల్.. ఇండోర్‌ హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో గిల్ (21, 5) నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు గురువారం నుంచి ఆరంభం అయ్యే చివరి టెస్టులో గెలిస్తేనే భారత్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మరి ఈ కీలక టెస్టులో గిల్‌కు చోటు దక్కుతుందో లేదో చూడాలి. 

Also Read: Shakib Al Hasan 300 Wickets: చరిత్ర సృష్టించిన షకీబ్‌ అల్‌ హసన్‌.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!  

Also  Read: Hero New Splendor 2023: సరికొత్త 'హీరో స్ల్పెండర్‌' వచ్చేసింది.. మైలేజ్ 70 కిమీ! ధర కేవలం 83 వేలే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News