టీ20 ప్రపంచకప్‌ 2022లో సంచలనం.. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై జింబాంబ్వే విజయం! పాక్ ఔట్

Zimbabwe beat Pakistan in ICC T20 World Cup 2022. సూపర్ 12లో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై జింబాంబ్వే అద్భుత విజయం సాధించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 27, 2022, 08:43 PM IST
  • టీ20 ప్రపంచకప్‌ 2022లో సంచలనం
  • ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై జింబాంబ్వే విజయం
  • మెగా టోర్నీ నుంచి పాకిస్తాన్‌ ఔట్
టీ20 ప్రపంచకప్‌ 2022లో సంచలనం.. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై జింబాంబ్వే విజయం! పాక్ ఔట్

Zimbabwe beat Pakistan in ICC T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022లో మరో సంచలనం నమోదైంది. సూపర్ 12లో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై జింబాంబ్వే అద్భుత విజయం సాధించింది. జింబాంబ్వే నిర్ధేశించిన 131 లక్ష్య చేధనలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది. దాంతో 1 పరుగు తేడాతో జింబాంబ్వే ఊహించని విజయాన్ని అందుకుంది. పాక్ బ్యాటర్ షాన్‌ మసూద్‌ చేసిన 44 పరుగులే టాప్‌ స్కోర్‌. జింబాబ్వే బౌలర్ సికందర్‌ రజా 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

131 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు ఆరంభం దక్కలేదు. టీమిండియాపై విఫలమయిన ఓపెనర్లు బాబర్ ఆజామ్ (4), మహ్మద్ రిజ్వాన్ (14) త్వరగానే పెవిలియన్ చేరారు. ఇఫ్తికార్ అహ్మద్ (5) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో షాన్‌ మసూద్‌ జట్టును ఆదుకున్నాడు. షాదాబ్ ఖాన్ (17) అండతో విలువైన రన్స్ చేశాడు. పాక్ లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో సికందర్‌ రజా అద్భుతంగా బౌలింగ్ చేసాడు. షాదాబ్ సహా హైదర్ అలీ (0)ని ఔట్ చేశాడు. ఆ వెంటనే మసూద్‌ కూడా ఔట్ అవ్వడంతో పాక్ కష్టాల్లో పడింది. 

టీమిండియాతో జరిగిన మ్యాచులో చివరి ఓవర్ వేసిన మహ్మద్‌ నవాజ్‌ (22) పాక్ జట్టును ఆదుకున్నాడు. మహ్మద్‌ వసీమ్‌ (12) సహాయంతో జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. చివరి 2 ఓవర్లలో 22  రన్స్ చేయాల్సి ఉండగా.. నగరవ 19వ ఓవర్లో 11 రన్స్ ఇచ్చాడు. దాంతో చివరి ఓవర్లో పాక్ విజయానికి 11 రన్స్ చేయాల్సి వచ్చింది. బ్రాడ్ ఎవాన్స్ మొదటి బంతికి 3 రన్స్, రెండో బంతికి ఫోర్ ఇవ్వడంతో మ్యాచ్ పాక్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. 3, 4 బంతులుఅద్బుతంగా వేసిన ఎవాన్స్.. ఐదో బంతికి నవాజ్‌ను ఔట్ చేశాడు. చివరి బంతికి షహీన్ ఆఫ్రిది రనౌట్ అవ్వడంతో జింబాంబ్వే 1 పరుగు తేడాతో గెలిచింది. సికందర్‌ రజా మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయ్యాడు. 

అంతకముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్‌ విలియమ్స్‌ (31) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు మాధేవేరే (17), క్రెయిగ్ ఎర్విన్ (19) రన్స్ చేశారు. ఇక ఇన్నింగ్స్ చివర్లో బ్రాడ్‌ ఎవన్స్‌ (19), రెయాన్‌ బర్ల్‌ (10 నాటౌట్‌) కీలక పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ వసీమ్‌ 4, షాదాబ్‌ ఖాన్‌ 3 వికెట్స్ తీశారు. ఈ ఓటమితో పాక్ సెమీస్ చేరడం కష్టంగా మారింది. పాక్ దాదాపు ఆశలు వదులుకోవాల్సిందే. 

Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Also Read: టూపీస్ బికినీలో ఇలియానా.. హాట్ హాట్ అందాలకు ఊపిరి పీల్చుకోలేకపోతున్న కుర్రకారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News