మహ్మద్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Rohit Slapped Siraj: న్యూజిలాండ్ తో తొలి టీ20లో (IND vs NZ T20I) భాగంగా టీమ్ఇండియా డగౌట్ లో అనుకోని సంఘటన జరిగింది. ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Rohit Siraj) పై కెప్టెన్ రోహిత్ శర్మ చేయి చేసుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 11:45 AM IST
    • టీమ్ఇండియా పేసర్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
    • డగౌట్ లో కూర్చొన్న సిరాజ్ తలపై కొట్టిన రోహిత్
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్
మహ్మద్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Rohit Slapped Siraj: జైపూర్ వేదికగా న్యూజిలాండ్ తో బుధవారం జరిగిన తొలి టీ20లో (IND vs NZ T20I) అనూహ్య సంఘటన జరిగింది. టీమ్ఇండియా బ్యాటింగ్ సమయంలో డగౌట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రవిడ్, మహ్మద్ సిరాజ్ కూర్చొని ఉన్నారు. అంతలోనే ఏమి జరిగిందో ఏమో తెలియదు.. సిరాజ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Siraj) చేయి చేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

న్యూజిలాండ్ తో తొలి టీ20 ఉత్కంఠగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమ్ఇండియా కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత బ్యాటర్లు రాణించినప్పటికీ చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. అయితే.. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ పెవిలియన్ చేరాక డగౌట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీవీ వైపు తీక్షణంగా చూస్తున్నారు. తమ పక్కనే కూర్చున్న సిరాజ్ (Mohammed Siraj News) మాత్రం పరధ్యానంలో ఉన్నాడు.

అదే సమయంలో డగౌట్లో ఉన్న సిరాజ్ వైపు కెమెరా మళ్లింది. సిరాజ్ టీవీలో చూసిన రాహుల్.. తనకు ఏమైందన్నట్లు సీరియస్ గా ఓ లుక్కిచ్చాడు. వెంటనే రోహిత్ శర్మ (Rohit Sharma News) .. సిరాజ్ వెనకుంచి తలపై ఒక్కటిచ్చాడు. దీంతో సిరాజ్ పరధ్యానం నుంచి బయటకొచ్చి ఓ నవ్వు నవ్వాడు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..

Also Read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News