న్యూఢిల్లీ: సూర్య గ్రహణం కారణంగా రెండో రోజులో ఆటలో భాగంగా గురువారం నాడు ప్రారంభం కావాల్సి ఉన్న రంజి ట్రోఫీ మ్యాచ్‌లు ఆలస్యమయ్యాయి. అవును, సూర్య గ్రహణం ప్రభావం ముంబై, రాజ్‌కోట్, మైసూరులో జరుగుతున్న రంజీ ట్రోఫి మ్యాచ్‌లపై స్పష్టంగా కనిపించింది. పాక్షిక సూర్య గ్రహణం కారణంగా పలు చోట్ల ఉదయం 9.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్న క్రికెట్ మ్యాచ్‌లు మరో రెండు గంటలు ఆలస్యంగా 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఉత్తర్ ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం మ్యాచ్ ముగిసే సమయానికి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, హార్విక్ దేశాయ్ అర్ధ సెంచరీలతో రాణించారు. గురువారం.. అంటే నేడు జరగాల్సి ఉన్న ఆటపై సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ బుధవారమే ఓ ప్రకటన చేసింది. గురువారం నాటి సూర్య గ్రహణం కారణంగా ఉదయం ఉదయం 9.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్న క్రికెట్ మ్యాచ్ 11.30 గంటలకు ప్రారంభం అవుతుందని ఎస్‌సిఏ స్పష్టంచేసింది.
Read also : సూర్యగ్రహణం రోజున వింత ఆచారం
సూర్య గ్రహణం రోజున సూర్యుడిని చూస్తే కళ్లు దెబ్బ తింటాయని భావించే వారు ఆ సమయంలో బయటికి వచ్చే అవకాశం లేకపోవడమే ఈ రంజీ ట్రోఫి మ్యాచ్ ఆలస్యానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఇదే విషయమై నేత్ర నిపుణుల వద్ద చర్చించగా.. వారు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సూర్య గ్రహణం సమయంలో నేరుగా సూర్యుడిని చూస్తే.. కంటిలోని రెటినా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని తెలిపారు. సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని సదరు నేత్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఏర్పడిన సూర్య గ్రహణం పాక్షిక సూర్య గ్రహణం కావడంతో ఆ సమయంలో ఔత్సాహికులు పలు జాగ్రత్తలు తీసుకుని సూర్యుడిని చూడవచ్చని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live link here..