Steven Smith and Cheteshwar Pujara: ఐపీఎల్ తరువాత టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు రెడీ కానుంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7న ప్రారంభంకానుంది. ఇప్పటికే టీమిండియాను ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న భారత జట్టు ఆటగాళ్లు.. టోర్నీ ముగియగానే ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టనున్నారు. మే 23న కొంతమంది ప్లేయర్లతో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ముందుగానే బయలుదేరి వెళ్లనున్నారు. ఐపీఎల్ ఆడని టెస్ట్ స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవుతున్నాడు.
ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పుజారా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. పుజారా ఇంతకుముందు ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ జట్టును సెంచరీల వరదపారించి.. ఈసారి ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ ఆడనున్న తరుణంలో స్మిత్ కూడా ఇంగ్లాండ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేందుకు మూడు మ్యాచ్‌ల కోసం సస్సెక్స్‌తో ఆడేందుకు రెడీ అయ్యాడు.
గతేడాది జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో స్టీవ్ స్మిత్, ఛెతేశ్వర్ పుజారాలు అమ్ముడుపోలేదు. దీంతో ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు కాస్త విరామం లభించింది. కౌంటీ క్రికెట్ ఆడి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధం కావాలని అనుకుంటున్నారు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తరువాత ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ ఆడనుంది ఆసీస్. కౌంటీ క్రికెట్ స్మిత్‌కు ఎంతో ఉపయోకరంగా మారనుంది.
తమ జట్టులో స్టీవ్ స్మిత్ ఎంట్రీపై కెప్టెన్ పుజారా మాట్లాడాడు. తాము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటామని.. ప్రత్యర్థులుగా ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో తలపడ్డామన్నాడు. అయితే ఒక జట్టు తరుఫున కలిసి ఎప్పుడ ఆడలేదని చెప్పాడు. స్మిత్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. స్మిత్ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌ల తరువాత ప్రత్యర్థులుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడతామన్నాడు. ప్రస్తుతం భావాలు మిశ్రమంగా ఉన్నాయని చెప్పాడు. ఫీల్డ్‌లో ముఖాముఖిగా ఉన్నప్పుడు తమ మధ్య మంచి పోటీ ఉంటుందని.. కానీ మైదానం వెలుపల కూడా తామిద్దరం మంచి స్నేహితులం అని పుజారా తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook